బాలీవుడ్‌పై తాజాగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. దాదాపు 17ఏళ్ల తర్వాత `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ బాలీవుడ్‌పై తనకు మోజు లేదని చెప్పారు. 

ప్రస్తుతం స్టార్‌ హీరోలు పాన్‌ ఇండియా పేరుతో తెలుగుతోపాటు హిందీ, ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలు తెలుగుతోపాటు హిందీలోనూ విడుదలవుతున్నాయి. మంచి కలెక్షన్లని రాబడుతున్నాయి. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌ వంటి సీరియర్‌హీరోలు ఎప్పుడో బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ కూడా రాణించారు. బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసిందంటే నాగార్జునే. `శివ` రీమేక్‌తోపాటు `ఖుదా గవా`, `ద్రోహి`, `క్రిమినల్‌`, `మిస్టర్‌ చేచారా`, `ఎల్‌ఓసీ కార్గిల్‌` వంటి సినిమాల్లో నటించి విజయాలు అందుకున్నారు. 

అయితే చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. దాదాపు 17ఏళ్ల తర్వాత `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయార్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా విడుదల కాబోతుంది. అయితే బాలీవుడ్‌పై తాజాగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై తనకు మోజు లేదని చెప్పారు. 

ఓ మీడియా మాధ్యమంలో ఆయన మాట్లాడుతూ, `గతంలో కొన్ని హిందీ సినిమాలు చేశా. నాలాంటి ఆర్టిస్టులు ఏ ఇండస్ట్రీలోనైనా ఈజీగా సెట్‌ అవుతారు. అయినా బాలీవుడ్‌ అటెన్షన్‌ కోసం నేనెప్పుడూ తాపత్రయపడలేదు. అలాగని నేను హిందీ సినిమాలు చేయనని కాదు. బాలీవుడ్‌ నుంచి ఎవరైనా మంచి కథతో వస్తే కాదనను. `బ్రహ్మాస్త్ర`లో అమితాబ్‌ బచ్చన్‌గారు ఓ కీలక పాత్ర చేసినప్పటికీ రణ్‌బీర్, ఆలియాతోనే నాకు ఎక్కువ సీన్స్‌ ఉంటాయి` అని తెలిపారు. గతంలోనూ బాలీవుడ్‌పై అంతగా ఆసక్తి లేదని నాగ్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల `వైల్డ్‌ డాగ్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చిన నాగ్‌ ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.