కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ మన్మథుడు 2 ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీనితో చిత్ర వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. 

ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. నాగార్జున పలు టివి ఛానల్స్ లో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఓ టివి ఛానల్ లో ఆడియన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగార్జున బదులిచ్చాడు. చిత్ర పరిశ్రమలో ఏఎన్నార్ కాకుండా మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అభిమాని ప్రశ్నించగా.. చిరంజీవి అంటూ నాగ్ వెంటనే సమాధానం ఇచ్చాడు. చిరంజీవి ఎందుకు తనకు ఆదర్శమో కూడా నాగ్ వివరించాడు. 

ఎన్టీఆర్, ఎన్నార్ ఇద్దరూ పురాణగాధల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. వారిద్దరూ సీనియర్స్. కానీ చిరంజీవి, నేను ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళం. కాబట్టి చిరంజీవి గురించి నాకు బాగా తెలుసు. చాలా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. ప్రతి సందర్భంలో ఏదో సాధించాలి అనే తపనని చిరంజీవిలో గమనించాను అని నాగార్జున తెలిపారు.