కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 విడుదలకు సిద్ధం అవుతోంది. ఆగష్టు 9న మన్మథుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అఖిల్ కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఖిల్ ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించాడు. ఆ మూడూ నిరాశపరిచాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశ పరచడంతో తొలి విజయానికి అఖిల్ ఇంకా దూరంగానే ఉన్నాడు. 

అఖిల్ కెరీర్ విషయంలో నాగార్జునపై కూడా ఒత్తిడి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున స్పందిస్తూ అఖిల్ కెరీర్ గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపాడు. అఖిల్ ఇంకా కుర్రవాడే. తన తప్పుల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాడు. 

నా కెరీర్ ఆరంభంలో కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నాను. అఖిల్ కి కూడా ఒక రోజు వస్తుంది అని నాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.