సన్‌ డే.. ఫన్‌ డే అంటుంటాడు నాగార్జున. ఈ ఆదివారం మరింత ఫన్‌ తీసుకొచ్చాడు. అలాగే సర్‌ప్రైజ్‌ని తెచ్చాడు. ఈ ఆదివారం కన్నడ స్టార్‌ సుదీప్‌ని ముందుగా హోస్ట్ గా పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఆ తర్వాత నాగార్జున వచ్చి ఫన్‌ డేగా మార్చాడు. అయితే మోనాల్‌.. సుదీప్‌ అంటే ఇష్టమని చెబుతూ, సిగ్గుపడటం ఆకట్టుకుంటుంది. సుదీప్‌ వెళ్ళిపోయాక అసలైన ఆటను ప్రారంభించాడు నాగ్‌. 

ఈ రోజు ఫన్‌ టాస్క్ ల్లో భాగంగా మరోసారి జలజని తీసుకొచ్చాడు. ఓ ప్రత్యేకమైన ఫిల్మ్ తయారు చేశామని చెప్పి, మొన్న దెయ్యం రూమ్‌లోకి వెళ్ళి సోహైల్‌, అఖిల్‌ భయపడ్డ వీడియోని చూపించి ఆ ఇద్దరు గాలి తీసేశాడు. ఈ రోజు మరోసారి ఒక్కొక్కరిని దెయ్యం రూమ్‌లోకి పంపించి అందులో వస్తువులు తీసుకురమ్మని చెప్పాడు. ఒక్కొక్కరు వెళ్ళగా, అందులో విచిత్రమైనసౌండ్‌లతో భయపెట్టించాడు. దీంతో ప్రతి ఒక్కరు వణికిపోయారు. ఈ సందర్భంగా వచ్చే కామెడీ అందరిని నవ్వులు పూయించింది. 

చివర్లో ఎలిమినేషన్‌ ప్రక్రియ మరింత ఉత్కంఠగా మారింది. చివర్లో అరియానా, అవినాష్‌ ఉన్నారు. అవినాష్‌ వద్ద ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ ఉంది. దాన్ని వాడుతాడా? లేదా? అన్నది సస్పెన్స్ లో పెట్టాడు. కానీ ఈ వారం అవినాష్‌ ఎవిక్షన్‌ పాస్ వాడి సేవ్‌ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి హౌజ్‌లో బాగా ఆడి నవ్వులు పూయించిన అవినాష్‌ని ఎలిమినేషన్‌ వెంటాడటం విచారకరమనే కామెంట్‌ వినిపిస్తుంది. అదే సమయంలో పెద్దగా టాస్క్ లు ఆడని, పెద్దగా యాక్టివ్‌గా లేని మోనాల్‌ని సేవ్‌ చేయడం విమర్శలకు తావిస్తుంది.