డిమాండ్ మ్యాటర్స్:మెగా హీరోకు 5 కోట్లు ఇస్తున్న నాగ్

 వైష్ణవ్ కు నాగార్జున ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికాన్ని ఇవ్వబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పృధ్వీ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.

Nagarjuna give huge remunaration for vaishnav tej upcoming movie jsp

ఎంతోకాలంగా ఫీల్డ్ లో ఉన్న నాగార్జునకు మార్కెట్,హీరోల రెమ్యునేషన్ డిమాండ్స్ గురించి బాగా తెలుసు. అందుకే ఆయన తన బ్యానర్ లో సినిమా అంటే బేరాలు మొదలెట్టరు. అడిగింది ఇచ్చేయమని, మార్కెట్ రేటు ఓ సారి సరిచూసుకోమని మాత్రమే తమ టీమ్ కు చెప్తారు. తన టీవీ షోల విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఆయన అదే పాటిస్తారు. అందుకే నాగ్ తో సినిమా అన్నా షో అన్నా అందరూ ఉత్సాహం చూపిస్తారు. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే నాగ్ తీసుకున్నాడని సమాచారం. ఇంతకీ ఏమిటా నిర్ణయం ...

ప్రముఖ నటుడు, నిర్మాత నాగార్జున సైతం వైష్ణవ్ తేజ్ తో సినిమా తీయాలని కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా నటిస్తాడట. ఇందుకోసం వైష్ణవ్ కు నాగార్జున ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికాన్ని ఇవ్వబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పృధ్వీ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి తన కొడుకులు నాగచైతన్య, అఖిల్ తో కాకుండా నాగార్జున… వైష్ణవ్ తేజ్ తో ఎందుకు సినిమా నిర్మించబోతున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే!

ఉప్పెన‌లా తెరుగు తెరపై ఒక్క‌సారిగా  విరుచుకుప‌డ్డాడు వైష్ణ‌వ్ తేజ్‌. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వ‌డ‌మే కాకుండా రూ.100 కోట్ల క్ల‌బ్ లోనూ చేరింది.దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా నాలుగు రెట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఆ వెంట‌నే.. వైష్ణ‌వ్ కి అవ‌కాశాలు వ‌రుస‌క‌ట్టాయి.  అన్న‌పూర్ణ బ్యాన‌ర్ లో, నాగార్జున నిర్మాత‌గా ఓ సినిమా చేయ‌డానికి సంత‌కాలు చేశాడు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా నటిస్తాడట. 
ఈ చిత్రంతో పృథ్వీ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. కథ రెడీ అయ్యింది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

ఇందుకోసం వైష్ణవ్ కు నాగార్జున ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికాన్ని ఇవ్వబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. 

తొలి సినిమాకి కేవ‌లం 50 ల‌క్ష‌ల పారితోషికం తీసుకున్నాడు వైష్ణ‌వ్‌. ఆ త‌ర‌వాత‌... సినిమా 50 కోట్లు అందుకోవ‌డంతో వైష్ణ‌వ్ కి అద‌నంగా పారితోషికం ఇచ్చింద మైత్రీ మూవీస్‌. క్రిష్ సినిమాకి 2 కోట్ల పారితోషికం అందుకున్న వైష్ణ‌వ్.. మూడో సినిమాకి 5 కోట్ల రేంజ్ కి చేరాడు. ఈ సినిమా కూడా హిట్ట‌యితే.. వైష్ణ‌వ్ రూ.10 కోట్ల హీరో అయిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు సినీ జనం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios