డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ది ఘోస్ట్ డిజాస్టర్ వసూళ్లు అందుకుంటుంది. నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాను పట్టించుకున్న నాథుడే లేదు. దీంతో నాగార్జున సోలో హీరోగా కష్టమేనేమో అనిపిస్తుంది.
ది ఘోస్ట్ సినిమాతో నాగార్జున మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి మూవీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టినా సెకండ్ హాఫ్ పుంజుకుందన్న అభిప్రాయం క్రిటిక్స్ వెల్లడించారు. తీరా వసూళ్లు మాత్రం నిరాశపరిచాయి. ది ఘోస్ట్ మూడు రోజుల వరల్డ్ వైడ్ షేర్ ఐదు కోట్లు దాటలేదు. ఏడు కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఇది కనీసం నటీనటుల రెమ్యూనరేషన్ అంత కూడా లేదు. ది ఘోస్ట్ ట్రెండ్ చూస్తుంటే భారీ నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది.
అదే సమయంలో నాగార్జున సోలో హీరోగా ఇక కష్టమే అన్న సందేహాలు కలిగిస్తుంది. నాగార్జున హీరోగా ఇటీవల విడుదలైన మన్మధుడు 2, ఆఫీసర్, వైల్డ్ డాగ్ డిజాస్టర్స్ అయ్యాయి. నాగ చైన్యతో చేసిన బంగార్రాజు మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుంది. బంగార్రాజు చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ సంక్రాంతి సీజన్ కావడం, పోటీ లేకపోవడంతో పుంజుకొని చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది.
నాగార్జున నటించిన ది ఘోస్ట్ లాంటి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది. అసలు నాగార్జున మార్కెట్ ఉందా లేదా అనే సందేహం కలుగుతుంది. ఈ క్రమంలో నాగార్జున మంచి నిర్ణయం తీసుకుంటే బెటర్. వెంకటేష్ ఈపాటికే ఈ విషయం అర్థం చేసుకున్నారు. ఆయన వయసుకు తగ్గ పాత్రలు, చిత్రాలు ఎంచుకుంటున్నారు. ఓటీటీలో విడుదల చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. మల్టీస్టారర్స్ మాత్రమే థియేటర్స్ లో విడుదల చేస్తున్నాడు. కాబట్టి నాగార్జున రియాలిటీని అర్థం చేసుకొని సినిమాలు ఎంచుకుంటే బెటర్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ రోల్ చేశాడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్.
