Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున మందు ముక్క, అదేనండీ బీరు బిర్యానీతో ఎంజాయ్ అట

  • కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో రాజుగారి గది2
  • బాక్సాఫీస్ వద్ద మాంచి సక్సెస్ సాధించిన రాజుగారిగది2
  • సక్సెస్ మీట్ లో బీరు బిర్యానీతో సక్సెస్ ఎంజాయ్ చేశానన్న నాగ్
nagarjuna enjoying raju gari gadi 2 success

కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో నటించిన రాజుగారి గది2 సక్సెస్ తో మాంచి జోష్ లో వున్నారు. మామూలుగానే ముక్కుసూటిగా వుండే నాగార్జున.. తన మనసులో ఏది ఉంటుందో అది మాట్లాడేస్తాడు. రాజు గారి గది-2 సక్సెస్ అవడంతో ఆ సక్సెస్ మీట్ లో మరింత జోష్ గా కనిపించాడు నాగార్జున. సమంత కోడలుగా మారిన తర్వాత వచ్చిన మొదటి సినిమా ఇది హిట్ అయితేనే బాగుంటుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన నాగార్జున ఈ సినిమా సక్సెస్ కావటంతో చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు.

 

ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తన సండే మెనూ కూడా బయటపెట్టాడు నాగ్. “రాజుగారి గది2 సక్సెస్ తో ఓ బిరియాని తిన్నా.. దానికి ముందే ఓ రెండు బీర్లు తాగా.. హాయిగా పడుకున్నా” అంటూ నాగార్జున చెప్పిన విధానం చూస్తే షాకింగ్ గా అనిపించింది. బీర్లు బిరియాని అని నాగార్జున మాట్లాడిన తీరు చూసి కార్యక్రమానికి హాజరైన వారంతా అవాక్కయ్యారు. 

 

ఇక రాజు గారి గది-2 సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. సినిమాలో తాను కామెడీ పంచ్ లు వేశానని అన్నారు. సినిమా సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ కావాలనే కట్ చేశామని దాని వల్ల సినిమాలో సీరియస్ నెస్ పోతుందని అన్నారు.

 

ఇక సినిమా సక్సెస్ తో అక్కినేని కోడలు సమంత మరింత హ్యాపీగా కనిపించింది. ఓంకార్ రాజు గారి గది-3కి కథ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios