కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన్మథుడు సీక్వెల్ అనగానే ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. తాజాగా నాగార్జున ఆ అంచనాలు ఇంకాస్త ఎక్కువయ్యే విషయాన్ని ప్రకటించారు. 

ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ లో నటిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ విషయం గురించి ఫుల్ క్లారిటీ ఇస్తూ నాగార్జున ట్వీట్ చేశాడు. సమంత మన్మథుడు 2లో చిన్న రోల్ ప్లే చేస్తోందని తెలిపాడు. కోడలు పిల్లతో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మన్మథుడు 2 ఫన్ మూవీగా మీ ముందుకు రాబోతోంది అని నాగ్ ట్వీట్ చేశాడు. సమంతతో కలసి ఉన్న పిక్ ని షేర్ చేశాడు. 

నాగ్ ట్వీట్ కు సమంత స్పందించింది. మన్మథుడు 2లో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ప్రారంభం నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. మన్మథుడు 2 తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది అని సమంత తెలిపింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.