Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే నాగచైతన్య, అఖిల్‌లతో మల్టీస్టారర్‌..కన్ఫమ్‌ చేసిన నాగార్జున..

త్వరలోనే నాగచైతన్య, అఖిల్‌లతో మల్టీస్టారర్స్ తెరకెక్కబోతుంది. తాజాగా ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించారు.  ప్రస్తుతం నాగార్జున `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటించారు. అహిసోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.  చిత్రప్రమోషన్‌ లో భాగంగా ఈ విషయాన్నివెల్లడిచారు నాగ్‌.

nagarjuna confirm multistarrer with his sons naga chaitanya and akhil  arj
Author
Hyderabad, First Published Mar 31, 2021, 7:38 PM IST

కింగ్‌ నాగార్జున `మనం` చిత్రంలో నాన్నగారు, ఏఎన్నార్‌, ఇద్దరు కుమారులు నాగచైతన్య,  అఖిల్‌లతో మల్టీస్టారర్‌ చేశాడు. అందులో అఖిల్‌ గెస్ట్ రోలే అయినా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసింది. ఆ తర్వాత వీరి కలిసి నటించింది లేదు. త్వరలోనే నాగచైతన్య, అఖిల్‌లతో మల్టీస్టారర్స్ తెరకెక్కబోతుంది. తాజాగా ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించారు.  ప్రస్తుతం నాగార్జున `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటించారు. అహిసోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. దియా మీర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటించారు. ఎన్‌ఐఏ నేపథ్యంలో అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

ప్రస్తుతం తాను ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. కాజల్‌ హీరోయిన్‌. ఇది పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుందన్నారు. మరోవైపు కళ్యాణ్‌ కృష్ణతో `బంగార్రాజు`కి సంబంధించిన స్కిప్ట్ వర్క్ జరుగుతుందని, అది సంక్రాంతి పండుగ సినిమా అని చెప్పాడు. టైమ్‌ అడ్జెస్ట్ మేరకు దాన్ని ఈ ఏడాది తెరకెక్కించాలనేది ఆలోచిస్తున్నామన్నారు. ఇందులో చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. తామిద్దరం కలిసి నటిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు అఖిల్‌తోనే ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. మోహన్‌రాజా డైరెక్షన్‌లో ఇది ఉంటుందని, డిస్కషన్స్ జరుగుతున్నాయన్నారు. ఇది పూర్తి యాక్షన్‌ చిత్రమని తెలిపారు. 

ఇక `వైల్డ్ డాగ్‌` గురించి చెబుతూ, తన కెరీర్‌లోనే స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌,బెస్ట్ క్యారెక్టర్‌ చేస్తున్నానని, దీనికోసం చాలా రిస్క్ తీసుకున్నట్టు చెప్పారు. హిమాలయాల్లో షూటింగ్‌ ని బాగా ఎంజాయ్‌ చేశానని చెప్పుకొచ్చారు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్ర ఎలా ఉండాలనేదానిపై దర్శకుడు బాగా రీసెర్చ్ చేశారని, సర్జికల్‌ స్ట్రైక్‌లో పాల్గొన్న ఓ మేజర్‌ని సెట్‌కి తీసుకొచ్చి యాక్షన్‌ సీక్వెన్స్‌లో చాలా హెల్ప్‌ చేశారు. పుషప్స్‌, హ్యాండ్‌ సిగ్నల్స్‌, గన్‌ ఎలా పట్టుకోవాలి, గ్రానైట్స్‌ ఎలా హ్యాండిల్‌ చేయాలి.. ఇలాంటివన్నీ నేర్పించారని చెప్పారు. 

`పూణెలోని జర్మనీ బేకరీలో మొదలై దేశంలో దాదాపు 17 చోట్ల బ్లాస్టింగ్స్‌ జరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన ట్విన్స్‌ బ్లాస్ట్స్‌ కూడా అందులో ఒకటి. ఆ వరుస బ్లాస్టింగ్స్‌ ఛేదించడం కోసం గవర్నమెంట్‌ ఆరుగురు ఎన్‌ఐఎ ఆఫీసర్స్‌ని నియమిస్తుంది. వాళ్ళు ఎలా దాన్ని  ట్రేస్‌ చేశారు..అనేది మెయిన్ పాయింట్‌..అయితే ఆ ‌ఇన్‌వెస్టిగేషన్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళను పట్టుకొని ఇండియా కోర్టులో ప్రవేశ పెట్టి ఇండియా ఎంత కేపబుల్‌ అనేది మిగితా ప్రపంచానికి చూపించాలి అనేది వాళ్ళ మిషన్` అని తెలిపారు నాగార్జున.

తాను తన కెరీర్‌లో ఇప్పటి వరకు 40మంది కొత్త డైరెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేశానని, కొత్త దర్శకుడితో పనిచేసిన ప్రతి సారి ఎగ్జైట్‌ అవుతానని, కొత్త విషయాలు నేర్చుకుంటానని, యంగ్‌ టీమ్‌తో చేసినప్పుడు కొత్త ఎనర్జీ వస్తుందన్నారు. కొత్త డైరెక్టర్‌ చేస్తే సినిమాకి కొత్తదనం వస్తుందని, తాను చేసే పాత్రలు కూడా కొత్తగా ఉంటాయన్నారు. తన యాక్టింగ్‌ స్టయిల్‌ మారుతుందనే హోప్‌ తనకు ఉంటుందన్నారు. `చేసిన పాత్రలే చేస్తూ ఉంటే బోర్‌ ఫీవుతాం. ఆ కారణం చేతనే కొత్త డైరెక్టర్స్‌తో వర్క్‌ చేయడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తాను. నేను ఈరోజు ఇంత పెద్ద స్టార్‌ అయ్యానంటే కేవ‌లం కొత్త డైరెక్టర్స్‌, కొత్తదనం వ‌ల్లే` అని చెప్పారు నాగ్‌.

తన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో కొత్త దర్శకులను ఎంకరేజ్‌ చేస్తున్నామని, ప్రస్తుతం రెండు మూడు సినిమాలు జరుగుతున్నాయన్నారు. రాజ్‌తరుణ్‌తో ఓ సినిమా ఉంటుందని చెప్పారు. అలాగే వైష్ణవ్‌ తేజ్‌తో మరో సినిమాకి సంబంధించిన డిస్కషన్‌ జరుగుతున్నాయన్నారు. `ఉప్పెన`కి మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు మరో కొత్త ప్రాజెక్ట్ డిస్కషన్‌లో ఉందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios