మన్మథుడు 2 సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో ఒక ప్రశ్న ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. నాగార్జున త్రివిక్రమ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? వారిద్దరి మధ్య అసలేం జరిగింది అనే ప్రశ్నలు రోజుకోటి వైరల్ అవుతున్నాయి. ప్రీ రిలీజ్ వేడుకలో మన్మథుడు సినిమా తన కెరీర్ లో మరచిపోలేని సినిమా అని చెప్పిన నాగ్ ఆ సినిమా సక్సెస్ కి కారణమైన త్రివిక్రమ్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. 

అయితే ఇటీవల మన్మథుడు 2 ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయంపై నాగ్ స్పందించాడు. కానీ మాటల మాంత్రికుడు గురించి అప్పుడు కూడా ఏమి మాట్లాడలేదు. మన్మథుడు 2 సినిమాకు కథ - మాటలు రాసింది త్రివిక్రమ్. అయితే తనకు ఫుల్ స్క్రిప్ట్ చెప్పింది మాత్రం దర్శకుడుకె.విజయ్ భాస్కర్ గారే అని నాగ్ వివరణ ఇచ్చాడు. 

అంతే కాకుండా వెంటనే యాంకర్ కి అవకాశం ఇవ్వకుండా నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళమని చెప్పడం చూస్తుంటే వారిద్దరి మధ్య ఎదో తెలియని యుద్ధమే జరిగిందని అర్ధమవుతోంది. నాగార్జున కొడుకులతో సినిమా చేస్తానని గతంలో కమిట్మెంట్ తీసుకొని సడన్ గా త్రివిక్రమ్ ప్లేట్ మార్చడం వల్లే మనస్పర్ధాలకు దారి తీసి ఉండవచ్చని ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ అయితే జోరుగా వినిపిస్తోంది. 

మరి అది ఎంతవరకు నిజమో తెలియదు గాని మన్మథడు పుట్టుకకు కారణమైన త్రివిక్రమ్ ను తొందరపాటులో నాగ్ మర్చిపోయాడు అనే విషయం అబద్దమని నాగ్ చెప్పిన మాటల్లో స్పష్టంగా అర్థమైంది. మొత్తానికి ఎదో జరిగిందన్నమాట..?