Asianet News TeluguAsianet News Telugu

Bangarraju:మార్నింగ్ షోలకి డ్రాప్ ఉన్నా...వీకెండ్ లో అంతొచ్చిందంటే

 తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ షోలకి 25% వరకు డ్రాప్స్ కనిపించినా కానీ మ్యాట్నీ షో టైం నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని గ్రోత్ ని ఆన్ లైన్ లో అలాగే ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోయింది.

 

Nagarjuna Bangarraju weekend collections
Author
Hyderabad, First Published Jan 17, 2022, 7:58 AM IST


సంక్రాంతి కానుకగా మంచి అంచనాల మధ్య ఈ సినిమా రిలీజైంది.  అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమాకు మార్నింగ్ షో నుంచే  అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘సొగ్గాడే చిన్న నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే అదరగొడుతూ ముందుకు సాగుతోంది. ఇక మూడో రోజు కూడా అదే  హవా కంటిన్యూ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.  తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ షోలకి 25% వరకు డ్రాప్స్ కనిపించినా కానీ మ్యాట్నీ షో టైం నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని గ్రోత్ ని ఆన్ లైన్ లో అలాగే ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోయింది.

సినిమా మూడు రోజులు పూర్తీ అయ్యే సరి కి  రెండు తెలుగు రాష్ట్రాలలో 38 కోట్ల నుండి 39 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు.అలాగే వరల్డ్ వైడ్ గా 42 కోట్ల నుండి 43 కోట్ల రేంజ్ లో వసూళ్ళని గ్రాస్ రూపంలో సొంతం చేసుకుందిట. పండగ కళ మొత్తం థియోటర్స్ దగ్గరే కనపడుతోంది. మొదటి మూడు రోజుల వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో ముగిసింది. అయితే మూడు రోజుల అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఇంకా రాలేదు.

ఇక అన్ని ఏరియాల‌కు క‌లిపి 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడం చాలా ఈజీ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.  అక్కినేని తండ్రీకొడుకులు నటించిన సినిమా కావడం.. బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడంతో బజ్ క్రియేట్ అయింది. 'బంగార్రాజు' ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫెస్టివల్ కు ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకునేలా చేసింది. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండటం కలిసొచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios