తిరుపతిలో సందడి చేశారు తమిళ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ కింగ్ నాగార్జున. వీరిద్దరి వల్ల భారీగా ట్రాపిక్ జామ్ కూడా ఏర్పడటంతో గందరగొళం పరిస్థితి నెలకొంది. 

తిరుమల తిరుపతి లో స్టార్ హీరోలు సందడి చేశారు. తిరుపతి కొండ మార్గంలో కింగ్ నాగార్జున , తమిళ స్టార్ హీరో ధనుష్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుండటంతో.. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దాంతో ఈ పరిణామం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చాలా కాలంగా అనౌన్స్ చేసి పక్కన పెట్టిన ధనుష్ , శేఖర్ కమ్ముల ప్రాజక్ట్ పట్టాలెక్కింది. ముందుగా శేఖర్ తో సినిమా చేయాల్సి ఉంది ధనుష్. కాని కొన్ని పరిణామాల వల్ల ఆయన ముందుగా వెంకీ అట్లూరితో సార్ సినిమా చేశారు. 

ఇక ముందుగా అనుకున్నట్టే ధనుష్ మూవీ పట్టాలెక్కింది. రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్న ఈసినిమా అప్పుడే సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈసినిమాలో ధనుష్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున్ కూడా నటిస్తుండటం విశేషం. రీసెంట్ గా నా సామిరంగ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ పాత్ర చేస్తున్నాడు. సర్ సినిమాతో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. రీసెంట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. 

అయితే ప్రస్తుతం ఈ నాగార్జున – ధనుష్ సినిమా షూటింగ్ తిరుపతిలోని అలిపిరి సమీపంలో జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచే షూటింగ్ మొదలుపెట్టడంతో అలిపిరి వద్ద ట్రాఫిక్ భారీగా ఎర్పడింది. ఓ వైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరో వైపు షూటింగ్ జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కాసేపు స్థానికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేశారు.