కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 షో రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున హోస్టింగ్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. కావాలనే నాగ్ కొన్ని అంశాలని ప్రస్తావించకుండా దాటేస్తున్నప్పటికీ హోస్ట్ గా చక్కగా ఒదిగిపోయాడు. మన్మథుడు 2 ప్రచారంలో భాగంగా నాగార్జున బిగ్ బాస్ 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

బిగ్ బాస్ షోని చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఈ షోకి క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కో రోజు ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారు. రోజు రోజుకి వారిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అని  నాగార్జున కామెంట్స్ చేశాడు. హోస్ట్ గా నాగార్జునలో ఇంతవరకు సీరియస్ యాంగిల్ కనిపించలేదు. కొన్ని వార్నింగ్స్ ఇచ్చాడంతే. 

బిగ్ బాస్ షో కాకుండా ఇతర భాషల్లో నటించే అంశంపై నాగార్జున స్పందించాడు. ధనుష్ తో ప్రారంభమైన సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోవడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని నాగార్జున తెలిపాడు. బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తున్నా. నా పాత్ర నచ్చింది కాబట్టే ఆ చిత్రం చేస్తున్నానని నాగార్జున తెలిపాడు. భవిష్యత్తులో బాలీవుడ్ లో నటించే ఉద్దేశం లేదని నాగ్ తెలిపాడు.