నాగచైతన్య కి పెద్ద షాక్ తగిలింది. ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ రద్దయ్యింది. నింబంధనలు ఉల్లంఘించిన కారణంగా అధికారులు షూటింగ్ ని రద్దు చేశారు.
నాగచైతన్య సినిమాకి పెద్ద షాక్ తగిలింది. ఆయన సినిమా షూటింగ్‌ని రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెట్‌లో వైన్ షాప్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే(ఈనాడు కథనం ప్రకారం).. నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నాటకలో జరుగుతుంది. కర్నాటకలోని మండ్య జిల్లాలోని మేలుకోట సమీపంలో రాజగోపురం తరహాలో మద్యం విక్రయ కేంద్రం(వైన్ షాప్) సెట్ వేశారు. ఇందులో పలు రకాల బ్రాండ్ల మద్యం సీసాలను ఉంచి చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులతో చిత్రీకరణకు అనుమతి ఇవ్వగా, చిత్ర యూనిట్ దాన్ని ఉల్లంఘించిందని స్థానిక కన్నడ సంఘాల ప్రతినిధులు విమర్శించారు.
దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అధికారులు ఈ సినిమా షూటింగ్‌ని రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర షూటింగ్‌ని మధ్యలోనే ఆపేసినట్టు సమాచారం. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందులో నాగచైతన్యకి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.
నాగచైతన్య చివరగా `థ్యాంక్యూ` చిత్రంతో మెరిసిన విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘోర పరాజయం చెందింది. ఇందులో రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించారు.
