Asianet News TeluguAsianet News Telugu

ఆ కులం వారికి నాగబాబు క్షమాపణలు!

మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సొంతగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని దాని ద్వారా రాజకీయ నాయకులను విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుని, లోకేష్ ని ఏబీఎన్ రాధాకృష్ణ ఎలా భజన చేస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియో విడుదల చేశాడు. 

nagababu sorry to bhatraju community
Author
Hyderabad, First Published Feb 9, 2019, 2:15 PM IST

మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సొంతగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని దాని ద్వారా రాజకీయ నాయకులను విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుని, లోకేష్ ని ఏబీఎన్ రాధాకృష్ణ ఎలా భజన చేస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో ఏబీఎన్ ఛానెల్ కి సంబంధించి వీడియోను ఉపయోగించడంతో వాటిని సదరు ఛానెల్ యాజమాన్యం యూట్యూబ్ ని తొలగించే విధంగా చర్యలు చేపట్టింది.

దీంతో నాగబాబు నా వీడియోను తీయించగలరేమో కానీ నన్ను ఆపలేరు అంటూ మరో వీడియో వదిలాడు. ఇప్పుడు ఆ వీడియోను కూడా తొలగించారు. అందులో నాగబాబు.. ఏబీఎన్ రాధాకృష్ణని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. పత్రికా స్వేచ్చని హరించకూడదని చెప్పే మీరు మా స్వేచ్చని హరిస్తారా అంటూ రాధాకృష్ణపై ఫైర్ అయ్యాడు నాగబాబు. 

అంతేకాదు.. 'మీరు చేసిన భట్రాజ్ పొగడ్తల్ని నేను చూపించా.. అందులో తప్పేముందని' అన్నాడు. అయితే ఇక్కడ భట్రాజ్ పొగడ్తలు అనే పదాన్ని వాడడంపై ఆ కమ్యునిటీ వారికి క్షమాపణలు చెప్పాడు నాగబాబు. అసలు ఆ సంఘం ఉందని తనకు తెలియదని పొరపాటు తన నోటి నుండి ఆ పదం వచ్చిందని.. క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్ పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆ కులం పేరుతో చాలా మంది ఉన్నారని,భట్రాజులు అనే వారిలో ఎక్కువమంది అనంతపురవాసులని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ భట్రాజులు అంటే అర్ధమేమిటంటే.. రాజులు ఏలిన కాలంలో వారి గొప్పతనాలను పొగుడుతూ రాజుల కొలువులో ఉండేవారు.  

Follow Us:
Download App:
  • android
  • ios