Asianet News TeluguAsianet News Telugu

నాన్నా అప్పుడు నాకు జ్ఞానం లేదు.. ఇప్పుడు నువ్వు లేవు.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్..

సినీయర్ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు తాజాగా తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగంగా కామెంట్స్ చేశారు. 
 

Nagababu Emotional Post, Nanna I had no knowledge then, Now you are not
Author
Hyderabad, First Published Jun 25, 2022, 6:40 PM IST

మెగా బ్రదర్ నాగబాబు అంటే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. దాదాపు ప్రతీ సమస్యపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు నాగబాబు. ఇక మెగా ఫ్యామిలీలో నాగబాబుకు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. పవన్ ను ఎవరు ఎమన్నా వెంటనే సోషల్ మీడియా వేదికన తనదైన శైలిలో స్పందిస్తారు. తమ్ముడికి మద్దుతగా నిలుస్తున్నాడు. ఇటీవల జనసేనలోనూ కీలక బాధ్యతలు చేపట్టిన నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజా పాలకుడిగా ఒక్కసారి ఎన్నుకోవాలని కోరారు. నిజమైన నాయకుడు పవన్ అంటూ తనదైన శైలిలో పర్యటనల్లో ప్రచారం చేస్తున్నారు.    

అదే విధంగా తన కుటుంబ సభ్యుల పట్ల కూడా నాగబాబు వెంటనే స్పందిస్తుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులంటే నాగబాబుకు ఎంతో ఇస్టం. ఆ మధ్యలో తన తల్లి కొణిదెల అంజనా దేవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాజాగా తన తండ్రి పుట్టిన రోజు కావడంతో చాలా ఎమోషనల్ గా స్పందించారు. ఈ సందర్భంగా నాగబాబు తండ్రి కొణిదెల వెంకట్రావ్  (Konidela Venkatrao) ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగభరితంగా నోట్ చేశారు. ‘నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బ్రతికి వున్నప్పుడు చెప్పాలన్న సెన్స్ గాని జ్ఞానం కానీ నాకు లేవు.
అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు’ అని పేర్కొన్నాడు. 

అలాగే నెటిజన్లకు కూడా సూచన చేశారు. ‘దయచేసి మీ తల్లిదండ్రులు, మీకు ప్రియమైన వారు బతికి ఉన్నప్పుడే వారితో మీ ఎమోషన్స్ ను షేర్ చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరీ తెలియజేస్తున్నాను.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ నెట్టిట వైరల్ అవుతోంది. నాగబాబుకు తన తండ్రిపై ఉన్న ప్రేమ అర్థమవుతోంది. ఇక వెంకట్రావ్ విషయానికొస్తే.. ఆయన పోలీస్ కానిస్టేబుల్ గా పని  చేశారు. 2007 డిసెంబర్ లో గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారు. ఈయన బాపు దర్శకత్వం వహించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ చిత్రంలో నటించాడు. 

ఇక నాగబాబు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పాటు రాజకీయా కార్యక్రమాలపై ఎక్కువ  ఫోకస్ పెట్టారు. పవన్ కు సపోర్ట్ గా ఉంటూ జనసేన పార్టీ కీలక బాధ్యతలను చూస్తున్నారు. గతంలో జబర్దస్త్ కామెడీ షోతో అలరించిన నాగబాబు ఆ తర్వాత ‘అదిరింది’ షోకు జడ్జీగా వ్యవహిరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో నటిస్తూనే.. అటు రాజకీయంగానూ చురుకుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios