మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల బాలసుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆడియో ఫంక్షన్ లకు హీరోయిన్లు వేసుకొచ్చే బట్టలపై బాలసుబ్రహ్మణ్యం అనుచిత కామెంట్స్ చేశారు.

దీంతో నాగబాబు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం ఒక్కరు మాత్రమే కామెంట్ చేయలేదని.. మురళీమోహన్ కూడా చేశారని ఇంకా చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు.

బయటకి మాత్రం ఏవో కబుర్లు చెబుతుంటారని అన్నారు. ఆడపిల్లల డ్రెస్ ల మీద కామెంట్ చేసే హక్కు ఏ మగాడికి లేదని అన్నారు.  హీరోయిన్ స్టైలిష్ గా డ్రెస్ వేసుకుంటే.. నిర్మాతలను, హీరోలను ట్రాప్ చేయడం కోసమేనా అంటూ ప్రశ్నించారు.

అసలు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మన ఇండియాలో ఆడదాన్ని గౌరవించరని చెప్పిన ఆయన అణగదొక్కడానికి ప్రయత్నిస్తారని సంచలన కామెంట్స్ చేశారు.