యంగ్ హీరో నాగశౌర్యకి నీహారికకి పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించడంతో పెళ్లి చేసుకోబోతున్నారనే మాటలు బలంగా వినిపించాయి. వీటితో పాటు కొన్నేళ్ల వరకు నాగశౌర్య.. నటి రాశిఖన్నాతో ఎఫైర్ సాగించాడని అన్నారు. 

ఈ వార్తలపై స్పందించిన నాగశౌర్య ఇవన్నీ న్యూసెన్స్ అంటూ తేల్చిచెప్పారు. తన మొదటి సినిమా అప్పటినుండి చాలా రూమర్స్ వస్తున్నాయని, అయితే తనవరకు వచ్చినవి రెండే రెండు అని అన్నారు. అందులో ఒకటి శౌర్యకి పెళ్లైపోయిందని, మరొకటి రాశిఖన్నాతో మూడేళ్లుగా ఎఫైర్ ఉందనే వార్త అని చెప్పారు.

నీహారికతో పెళ్లి వార్తలపై మండిపడ్డారు నాగశౌర్య. మీ ఇష్టం వచ్చినట్లు రాసేస్తారా..? అలా రాసుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటి..? అంటూ ఫైర్ అయ్యారు. పెళ్లి జరిగితే చెప్తాను కదా అని అన్నారు.

నీహారికతో 'ఒక మనసు' సినిమాలో నటించిన తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణం పెళ్లి కాదని, మంచి కథ కోసం ఎదురుచూసి 'ఛలో' సినిమా చేశానని అన్నారు. ఇక 'ఛలో' సినిమా సమయంలో రష్మికకి తనకు ఏదో ఉందని రాశారని.. అవన్నీ న్యూసెన్స్ తప్ప న్యూస్ కాదని మండిపడ్డారు. ఇప్పుడు రష్మికకి మరో హీరోని లింక్ చేసి రాస్తున్నారని ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయని అన్నారు.