స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో రాఘవేంద్రరావు  ఈ  సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేసి క్లూస్ ఇచ్చారు. 

‘నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో.. #JoharNTR’ అని రాఘవేంద్రరావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు.  

కానీ అందుతున్న సమాచారం ప్రకారం నాగశౌర్యను ఈ చిత్రంలో హీరోగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే నాగ శౌర్య స్టోరీ లైన్ విన్నారని , చాలా ఎగ్జైట్ అయ్యారని వినికిడి. అయితే ఇంకా సినిమాకు సైన్ చేయలేదంటున్నారు. డైరక్టర్స్ ముగ్గురులో ఒకరు క్రిష్  అని, మరో ఇద్దరు రాఘవేంద్రరావు శిష్యులు అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. . ఒక్కో కథను ఒక్కో దర్శకుడు డైరక్ట్ చేస్తారు. 

అయితే మూడింటికీ నాగ శౌర్యనే హీరో కావడం విశేషం. ఇలా రాఘవేంద్రరావు తన చివరి చిత్రం వైవిధ్యంగా చేస్తున్నారు. బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూసర్స్ గా రాఘవేంద్రరావు గారు కేవలం ప్రాజెక్టు ని పర్యవేక్షకుడుగానే  ఉంటారని చెప్తున్నారు. అయితే ముగ్గురు దర్శకుల్లో రాఘవేంద్రరావు గారు ఒకరు అయితే బాగుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.