బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్‌గా రాణించే అనుష శెట్టి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నాగశౌర్య. వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడయ్యాడు. ఆయన అనుష శెట్టిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం ఉదయం బెంగుళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్‌గా రాణించే అనుష శెట్టి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నాగశౌర్య. వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

బెంగుళూరులో ఓ ప్రైవేట్‌ వేదికగా నాగశౌర్య, అనుషశెట్టి వివాహం జరిగింది. ఇందులో ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నేడు వివాహం జరగ్గా శనివారం ప్రీ వెడ్డింగ్‌ సెర్మనీ(హల్దీ ఫంక్షన్‌), ఎంగేజ్‌మెంట్‌ సెర్మనీ జరిగింది. ఇందులో కాబోయే భార్యకి శౌర్య ఉంగరాన్ని తొడిగారు. ఈ సందర్బంగా కాక్‌ టైల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఆయా ఫోటోలు సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే నాగశౌర్య తన కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా అనుష శెట్టి పరిచయమైందని, ఇద్దరి మనసులు నచ్చడంతో పెళ్లికి సిద్ధమయ్యారు.

Scroll to load tweet…

ఇక నాగశౌర్య హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన `కృష్ణ వ్రిందా విహారి` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`, `నారి నారి నడుమ మురారి`, `పోలీస్‌ వారి హెచ్చరిక` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వరుస పరాజయాల అనంతరం ఆయనకు `కృష్ణ వ్రిందా విహారి`చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌కి మంచి బూస్ట్ నిచ్చింది.