నాగచైతన్య - సమంత విడాకుల తర్వాత.. ఆ విషయంలో బాధపడటంపై చైతూ కామెంట్స్..

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ ఫిల్మ్స్ ‘కస్టడీ’. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా చైతూ తన లైఫ్ లో బాధపడ్డ విషయంపై స్పందించారు. ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. 
 

Naga chatanya opens up on his biggest regret NSK

అక్కినేని నటవారసుడు నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం కేరీర్ లో బిజీగా అయ్యారు. సమంతతో విడాకుల తర్వాత ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెట్టారు. రెండేండ్ల కింద సామ్ - చైతూ విడిపోయిన విషయం తెలిసిందే. అసలు వీరిద్దరూ ఎందుకు డివోర్స్ తీసుకున్నారనేది ఇంతక వరకు ఎవ్వరికీ తెలియని విషయం. దీనిపై వారూ చెప్పలేదు. ఈ క్రమంలో తాజాగా చైతన్యకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.  
 
ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు నాగచైతన్య. ఈ సందర్భంగా డేర్ అండ్ ట్రూత్ సెగ్మెంట్ లో ఇంటర్వ్యూర్ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మీ జీవితంలో అతిపెద్ద ప్రశ్యాతాపం ఏంటీ అని అడిగారు. దీనికి  చైతూ ‘నా జీవితంలో అలాంటిది ఏం  లేదు’ అని బదులిచ్చారు. ‘ప్రతిదీ ఓ పాఠమే’నన్నారు. ఆ వెంటనే డివోర్స్ తర్వాత ఏదైనా బాధపడ్డ ఘటన, సినిమాల  పరంగానైనా ఉందా అని మళ్లీ ప్రశ్నించాడు.  దీనికి చైతూ ఆసక్తికరంగా ఆన్సర్ చేశారు.  

చైతూ మాట్లాడుతూ. ‘సినిమాల పరంగా చాలా బాధపడ్డ ఘటనలు ఉన్నాయి.  రెండు మూడు చిత్రాల విషయాల్లో మాత్రం రిగ్రీట్ గా ఫీల్ అయ్యినట్టు తెలిపారు’. ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక చైతూ, సమంత  విడాకుల తర్వాత తమ తమ లైఫ్ లో బిజీ  అయ్యారు. కేరీర్ పైనే ఫోకస్ పెట్టారు.  ఇదిలా ఉంటే.. ఇటీవల నాగచైతన్య, శోభితా దూళిపాళతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ఆరు నెలలుగా వీరిమధ్య ప్రేమాయణం కొనసాగుతుందోని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు లండన్ లో వీరు చక్కర్లు కొట్టిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఎప్పుడూ ఎవరూ స్పందించలేదు. ఇదిలా ఉంటే..  ప్రస్తుతం నాగచైతన్య తన లేటెస్ట్ ఫిల్మ్ ‘కస్టడీ’ (Custody)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కృతి శెట్టి కథానాయిక. మే 12 రిలీజ్ కానుంది.  ఈ సందర్భంగా  ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios