Asianet News TeluguAsianet News Telugu

"దూత" లో చైతు క్యారక్టర్, స్టోరీ లైన్ ఇదే

నాగ‌చైత‌న్య ఈ సిరీస్ తోనే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేస్తుండ‌టంతో ఇందులో ఆయ‌న పాత్ర ఏ విధంగా ఉండ‌నుంది? లుక్ ఎలా ఉంటుందోన‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు. 

Naga Chaitanya Turns A Journalist For Dhootha
Author
First Published Dec 13, 2022, 11:01 AM IST


రీసెంట్ గా  "ధాంక్యూ" సినిమాతో  పలకరించిన యువ హీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు అదే డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో "దూత" అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా అడుగు పెట్టబోతున్నారు. ఆ మధ్యన విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఒక హారర్ వెబ్ సిరీస్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వెబ్ సిరీస్ కథ ఎలా ఉండబోతోంది అందులో నాగచైతన్య పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు ఈ సీరిస్ లో నాగచైతన్య...జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. తను చేపట్టిన ప్రతీ ఎస్సైన్మెంట్ లోనూ ఎంత కష్టమైనా ఓర్చి సక్సెస్ అయ్యే జర్నలిస్ట్ గా కనిపిస్తారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో  ఈ సీరిస్ ని రూపొందిస్తున్నారు. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ గా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌న‌టువంటి సరికొత్త పాత్ర‌ను నాగ‌చైత‌న్య పోషిస్తున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది. ఇందులో చైత‌న్య ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

అతీంద్రియ శ‌క్తుల‌తో అమాయ‌కుల జీవితాల్ని నాశ‌నం చేసే వారిని ఎదుర్కొనే యువ‌కుడిగా ప‌వ‌ర్‌ఫుల్ గా నాగచైతన్య పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం.  జాతీయ అవార్డు గ్ర‌హీత‌,బెంగ‌ళూరు డేస్‌,చార్లీ వంటి మ‌ల‌యాళ సినిమాల‌తో ప్ర‌తిభ‌ను చాటుకున్న కథానాయిక పార్వ‌తి ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఆమెతో పాటు త‌మిళ నాయిక ప్రియాభ‌వానీ శంక‌ర్ మ‌రో లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. పెళ్లిచూపులు ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ వెల్ల‌డించింది.

 విక్ర‌మ్ కె కుమార్ ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది.    గతంలో విక్రమ్ మాధవన్ హీరోగా "13 బి" అనే ఒక హారర్ సినిమా తీశారు. టీవీ సీరియల్ పాత్రలతో సైతం భయాన్ని సృష్టించి ప్రేక్షకులను కట్టిపడేసారు విక్రమ్. అయితే "దూత" వెబ్ సిరీస్ లో కూడా విక్రమ్ అలాంటి ఒక షాకింగ్ ఎలిమెంట్ పెట్టబోతున్నారట. నిర్జీవంగా ఉండే వస్తువులు కూడా తప్పు చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. చట్టంలో వీటికి శిక్ష ఉండదు, పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. కానీ అలాంటి సమయంలో నాగచైతన్య కుటుంబాన్ని ఒక ప్రమాదం చుట్టుముడుతుంది. మరి వారిని కాపాడే "దూత" ఎవరు? కంటికి కనిపించని దెయ్యాల నుంచి నాగచైతన్య తన ఫ్యామిలీ ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ వెబ్ సిరీస్ సారాంశం అని కొందరు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios