సాధారణంగా స్టార్ డైరక్టర్స్ కు హీరోల నుంచి మంచి గౌరవం అందుతుంది. వెంటనే రెస్పాండ్ అవుతారు. కథ వింటారు. అదెలా ఉన్నా..తెరపై మ్యాజిక్ చేస్తారనే నమ్మకంతో ఓకే చేయటానికే ప్రయారిటీ ఇస్తారు. కానీ నాగచైతన్య మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వరస ఫెయిల్యూర్స్ తర్వాత మజలి వంటి హిట్ వచ్చింది. దాంతో చైతుకు ఆ హిట్ ని కొనసాగించాలంటే జాగ్రత్తలు తీసుకోవాలనిపించినట్లుంది.

దాంతో తనకు కెరీర్ లోనే చెప్పుకోదగ్గ హిట్ ని ఇచ్చి, తన భార్య సమంతని పరిచయం చేసిన ఏమి మాయ చేసావే దర్శకుడు గౌతమ్ మీనన్ కు నో చెప్పారు.ప్రస్తుతం గౌతమ్ మీనన్... ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఓ సినిమా చేస్తున్నారు. అందులో నాగేశ్వరరావు పాత్రకు గాను నాగచైతన్య ను అడిగారట. అయితే చైతు మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేసారట.

తాను అలా వచ్చి కొద్ది సేపు మాత్రమే తెరపై కనపడే ప్రాముఖ్యత లేని పాత్ర చేయదలుచుకోలేదని అన్నారట. ఇది విన్న గౌతమ్ మీనన్ ..రిక్వెస్ట్ చేసి, సమంత చేత చెప్పించాలని చూసారట. కానీ అటు నుంచి కూడా నెగిటివ్ రెస్పాన్సే వచ్చిందట. ప్రస్తుతం నాగచైతన్య..తన మేనమామ వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’ చేస్తున్న సంగతి తెలిసిందే.

పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్స్. కె.ఎస్‌.రవీంద్ర(బాబి) దర్శకుడు. వెంకీమామ చిత్రాన్ని సురేశ్‌ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు.  పల్లెటూరి నేపథ్యంతో పాటు, ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోనూ సినిమా సాగుతుంది. మరీ తెరవెనుక నిజమైన మామ-అలుళ్లు తెరపై ఎలా సందడి చేస్తారో చూడాలి.