Asianet News TeluguAsianet News Telugu

నాగ చైతన్యకి 'హను మాన్' పిచ్చ పిచ్చగా నచ్చేసిందట.. గూస్ బంప్స్ వచ్చాయంటూ రివ్యూ

సంక్రాంతి సందడి ముగిసింది. కానీ హను మాన్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఏ చిత్రం 100 కోట్ల షేర్ వైపు పరుగులు పెడుతోంది. చిన్న చిత్రం గా విడుదలైన హను మాన్ ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 

Naga Chaitanya review on Hanu Man movie dtr
Author
First Published Jan 21, 2024, 9:56 AM IST

సంక్రాంతి సందడి ముగిసింది. కానీ హను మాన్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఏ చిత్రం 100 కోట్ల షేర్ వైపు పరుగులు పెడుతోంది. చిన్న చిత్రం గా విడుదలైన హను మాన్ ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ,హీరో తేజ సజ్జా తమ చిత్రాన్ని బలంగా నమ్మి సంక్రాంతి బరిలో నిలిపారు. 

వారి ధైర్యమే ఇప్పుడు అద్భుతాలకు కారణం అవుతోంది. ఆంజనేయ స్వామి నేపథ్యంలో జనరంజకమైన సూపర్ హీరో చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు అందించారు. సెలెబ్రిటీలంతా హను మాన్ చిత్రాన్ని కొనియాడుతున్నారు. మొన్న సమంత హనుమాన్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించింది. ఇప్పుడు నాగ చైతన్యకి కూడా హను మాన్ చిత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. 

చైతు తనదైన శైలిలో హను మాన్ చిత్రానికి రివ్యూ ఇచ్చారు. ఈ మూవీ ఎందుకు అంతగా నచ్చిందో వివరించారు. 'హను మాన్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కంగ్రాట్స్. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్, రచనలో కొత్త తరం ఆలోచనలు ప్రతిబింబించాయి. సినిమా మొత్తం గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. తేజ సజ్జా తన పెర్ఫామెన్స్ తో కన్విన్స్ చేసే విధంగా నటించాడు. 

వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, అమృత అయ్యర్ లకు శుభాకాంక్షలు అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశారు. చైతు ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా హను మాన్ చిత్రానికి వసూళ్లు సాలిడ్ గా నమోదవుతున్నాయి. ఈ ప్రభంజనం ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios