Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్యని ఇరిటేట్‌ చేసిన నిహారిక.. తట్టుకోలేక మధ్యలోనే జంప్‌..

నాగచైతన్య మొదటిసారి వెబ్‌ సిరీస్‌ చేశారు. ఆయన ప్రస్తుతం `దూత` అనే వెబ్‌ సిరీస్‌తో రాబోతున్నారు. అయితే ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయనకు షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది.

naga chaitanya irritate by digital promoter niharika video viral arj
Author
First Published Nov 27, 2023, 2:40 PM IST

నాగచైతన్యకి సక్సెస్ దోబూచులాడుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న `కస్టడీ` మూవీ డిజాప్పాయింట్‌ చేసింది. దీంతో నెక్ట్స్ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం `తండేల్‌` అనే మూవీ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకుడు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. లుక్‌ అదిరిపోయింది. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగచైతన్య మరో సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు. ఆయన `దూత` వెబ్‌ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. 

విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్యకి `మనం` లాంటి హిట్‌ని, `థ్యాంక్యూ` లాంటి డిజాస్టర్‌ని ఇచ్చారు విక్రమ్‌. చాలా రోజులుగా `దూత` అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. దీన్ని పాన్‌ ఇండియాస్కేల్‌లో ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 1న ఇది అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. 

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ముంబయి, హైదరాబాద్‌, ఇతర ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది. డిజిటల్‌ ప్రమోటర్‌ నిహారిక చాలా ఇబ్బంది పెట్టింది. ఆమెతో సరదాగా కన్వర్జేషన్‌ చేద్దామని, తమ వెబ్‌ సిరీస్‌ని ప్రమోట్‌ చేద్దామని ప్రయత్నించాడు చైతూ. ఆమెకి `దూత` సిరీస్‌ గురించి చెప్పడం ప్రారంభించాడు. కానీ చెప్పే ప్రతి విషయానికి మధ్యలో అడ్డుపడుతుంది. తనకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పదాలు వస్తే వాటిని ప్రస్తావిస్తూ ఇరిటేట్‌ చేసింది. 

Read more: `గీతగోవిందం` హిట్‌ సెంటిమెంట్‌ రిపీట్‌ చేస్తున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక.. హింట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌

కామ్‌గా ఉండమంటే ఉంటా అంటూ మళ్లీ  సేమ్‌ రిపీట్‌ చేసింది. సినిమా ఆఫర్ ఇస్తానంటే సైలెంట్‌గా ఉంది, కానీ తనకు నచ్చిన పదం రావడంతో మళ్లీ సేమ్ రియాక్షన్‌. ఇక చైతూకి పిచ్చెక్కిపోయింది. దీంతో ఇరిటేషన్‌ తట్టుకోలేక నిహారికతో కన్వర్జేషన్‌ని ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయాడు చైతూ. అయితే షార్ట్ గా అయినా ఇందులో చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పాడు. ఈ సిరీస్‌లో తాను సాగర్‌ అనే జర్నలిస్ట్ పాత్రని పోషిస్తున్నట్టు చెప్పారు. మొదటిసారి ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే ఇదంతా జస్ట్ ఫన్నీ కోసం చేసిన వీడియోగా తెలుస్తుంది. ఇక `దూత`లో చైతూ జర్నలిస్ట్ గా వెలికితీసే వార్తల మూలంగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశాడు, ఈ సవాళ్లని ఎలా ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్‌ సాగుతుందని తెలుస్తుంది. 
 

Read more: మరో ఫ్లాప్‌ తప్పించుకున్న వరుణ్‌ తేజ్‌.. పాపం వైష్ణవ్‌ తేజ్‌ బుక్కయ్యాడు..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios