నైంటీస్ లో కుర్రాళ్లు ఎలా ఉండేవారు...గుర్తు చేస్తూ నాగచైతన్య వింటేజ్ లుక్ తో ఫస్ట్ లుక్ వదిలారు. ఈ ఫస్ట్ లుక్ ఫొటో చైతూ అభిమానులనే కాక, సినీ ప్రియులందరినీ ఎట్రాక్ట్ చేస్తూ వైరల్ అవుతోంది. ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తాజా సినిమా లుక్‌ని రిలీజ్‌ చేశారు.

నిజ జీవిత భార్యాభర్తలు నాగచైతన్య, సమంత..వివాహానంతరం కలిసి చేస్తున్న సినిమా ఇది.  పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న ఈ జంట, తెరపై కూడా భార్యా భర్తలుగా తెరపై అల్లరి చేయబోతున్నారు.   ఈ సినిమాలో మాజీ క్రికెటర్‌గా నాగచైతన్య, రైల్వే ఉద్యోగినిగా సమంత కనిపిస్తారని సమాచారం. కథ  పరంగా తరచూ గొడవపడే భార్యాభర్తలుగా నటిస్తున్నారు చైతన్య, సమంత. 

‘మజిలీ’అనే వర్కింగ్‌ టైటి ల్‌ తో  రూపొందుతున్న ఈ చిత్రం రీసెంట్ గా వైజాగ్‌లో ప్రారంభమై ఫస్ట్  షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌లో చైతన్య, సమంతలపై కీలక సన్నివేశాలను షూట్ చేసారు. అలాగే బడి, గుడికి సంబంధించిన సీన్స్‌ తీశారు. ఈ సీన్స్‌ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయట. 

రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది.  శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విశాఖపట్నంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది.  తనికెళ్ల భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌.