Asianet News TeluguAsianet News Telugu

చైతూకి డిజిటల్ చీమ కుట్టింది

 గత కొద్ది రోజులుగా చైతుతో ఓ పెద్ద వెబ్ స్ట్రీమింగ్ యాప్ వాళ్లు చర్చలు జరుపుతన్నారు. వెబ్ సీరిస్ లో నటించటం ద్వారా గ్లోబుల్ గా గుర్తింపు వస్తుందని భావిస్తున్నాడు. వెబ్ కంపెనీవాల్లతో డీల్ పూర్తవగానే ఎనౌన్సమెంట్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే చైతూ భార్య సమంత ..ది ఫ్యామిలీ మెన్ వెబ్ సీరిస్ లో చేస్తోంది. 

Naga Chaitanya in talks for a web series
Author
Hyderabad, First Published Oct 3, 2020, 12:48 PM IST

నేటి మన హీరోలలో నాగ చైతన్య కి ఓ ప్రత్యేకత వుంది. ఆఫర్ల కోసం వెంపర్లాడడు. అసలు తనకు వచ్చిన అన్ని సినిమాలనూ కూడా ఒప్పుకోడు. కథ, అందులో తన పాత్ర నచ్చాలి. దానికి తోడు,  ఫ్యామిలీ అంతా కూర్చుని చూసేలా సినిమా ఉండాలి వంటి కండిషన్లు కూడా పెడతాడు. అందుకే, చైతు చేస్తున్న సినిమాలు మనకు తక్కువగా కనిపిస్తుంటాయి. అయితే  ఇప్పుడీ యంగ్ హీరో వెబ్ సీరీస్ లో కూడా నటించడానికి ఓకే చెప్పబోతున్నాడట.  

అంత బాగా సబ్జెక్టు నచ్చిందిట. గత కొద్ది రోజులుగా చైతుతో ఓ పెద్ద వెబ్ స్ట్రీమింగ్ యాప్ వాళ్లు చర్చలు జరుపుతన్నారు. వెబ్ సీరిస్ లో నటించటం ద్వారా గ్లోబుల్ గా గుర్తింపు వస్తుందని భావిస్తున్నాడు. వెబ్ కంపెనీవాల్లతో డీల్ పూర్తవగానే ఎనౌన్సమెంట్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే చైతూ భార్య సమంత ..ది ఫ్యామిలీ మెన్ వెబ్ సీరిస్ లో చేస్తోంది. 

ఇక చైతూ ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే...నాగచైత‌న్య‌,సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం ల‌వ్ స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్షన్ లో వ‌స్తోన్న ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. అయితే పరిస్దితులు మెల్లిమెల్లిగా చక్కబడుతూండటంతో.. చైతూ అండ్ టీం మ‌ళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. తిరిగి షూటింగ్ కు రావ‌డం సంతోషంగా ఉంది. 

క‌రోనా నేప‌థ్యంలో అన్ని మార్గద‌ర్శకాలు, నిబంధ‌న‌లు పాటిస్తూ మొద‌‌టి రోజు షూటింగ్ అంటూ నాగ‌చైత‌న్య ఓ వీడియోను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు.  శేఖ‌ర్ క‌మ్ముల త‌న చిత్రాన్ని వీలైనంత త్వర‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నాకరు. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ధాంక్యూ అనే చిత్రం చేయబోతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios