Asianet News TeluguAsianet News Telugu

ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నా.. నాగ చైతన్య కామెంట్స్

థాంక్యూ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత నాగ చైతన్య మరో సినిమా ప్రారంభించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు నటించబోతున్న చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది.

Naga Chaitanya emotional tweet goes viral
Author
First Published Sep 24, 2022, 2:14 PM IST

థాంక్యూ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత నాగ చైతన్య మరో సినిమా ప్రారంభించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు నటించబోతున్న చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. వెంకట్ ప్రభు విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు. దీనితో ఈసారి చైతు మంచి హిట్ కొట్టడం ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

గత ఏడాది నాగ చైతన్య 'లవ్ స్టోరీ; చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మెప్పించింది. నాగ చైతన్య సరసన క్రేజీ బ్యూటీ సాయి పల్లవి నటించింది. నాగ చైతన్య కెరీర్ లో ఈ చిత్రం మెమొరబుల్ హిట్ గా నిలిచింది. 

శేఖర్ కమ్ముల తనదైన శైలిలో భావోద్వేగాలు జోడించి కులవ్యవస్థపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఫిదా చేసింది. ఈ చిత్రం విడుదలై నేటికి ఏడాది గడుస్తోంది. దీనితో నాగ చైతన్య ఈ మూవీని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నాడు. 

ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు, ఈ మూవీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. ఈ మూవీ నాకు ఎన్నో పాటలు నేర్పింది. ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకాలు అందించింది అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశాడు. 

లవ్ స్టోరీ తర్వాత చైతు బంగార్రాజు, థాంక్యూ, లాల్ సింగ్ చద్దా చిత్రాల్లో నటించాడు. బంగార్రాజు ఆకట్టుకుంది కానీ.. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios