కొన్నాళ్లుగా పరాజయాల్లో ఉన్న చైతన్య ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని చూసాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.
థాంక్యూ మూవీ తర్వాత నాగ చైతన్య చేసినకస్టడీ (Custody) సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటించింది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటించగా, ప్రియమణి మరో కీలక పాత్రలో కనిపించింది. కొన్నాళ్లుగా పరాజయాల్లో ఉన్న చైతన్య ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని చూసాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. అయితే ఈ సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ అందుకుంది. తెలుగులో మినిమం కూడా రావటం కష్టమని తేలిపోయింది. దాంతో తమిళ దర్శకుడు..ఎక్కువ మంది తమిళ ఆర్టిస్ట్ లు ఉన్న ఈ సినిమాకు అక్కడ రిజల్ట్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.
తెలుగుతో పోలిస్తే తమిళనాట టాక్ మెరుగ్గా ఉందని సమాచారం.ఈ శుక్రవారం ‘కస్టడీ’తో పాటుగా నాలుగు తమిళ సినిమాలు రిలీజ్ కావడం వల్ల దీనికి పెద్దగా హైప్ లేదు. అయితే వెంకట ప్రభు దర్శకుడు కావటం, అరవింద స్వామి విలన్ కావటం, రాంకీ, జీవా ప్రత్యేక పాత్రలలో నటించటం, శరత్‌కుమార్, ప్రేమ్‌గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కనిపించటం కలిసి వచ్చిందంటున్నారు. సినిమా పర్వాలేదనే టాకే అక్కడ వచ్చింది. రివ్యూలు తెలుగు అంత దారుణంగా లేవు. మౌత్ టాక్ కూడా ఫరవాలేదు అనిపించింది. వీకెండ్ షోలకు మంచి ఆక్యుపెన్సీనే కనిపించింది. నిన్న నైట్ షోలకు. ఓవరాల్‌గా తమిళం వరకు ‘కస్టడీ’ సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇది చైతుకు ఆనందం కలిగించే విషయమే.
తెలుగులో అయితే ...నాగ చైతన్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమా సహనానికి పరీక్షగా మారిందని చెప్తున్నారు.అంత పెద్ద కాస్టింగ్, బడ్జెట్ ఉన్నా బోర్ కొట్టిందని అన్నారు. రిపీట్ అయిన యాక్షన్ సీన్స్, యావరేజ్ కంటెంట్ సినిమాని ముంచేసాయని రివ్యూలు చెప్తున్నాయి.ఇక ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ స్టోరి అయితే మరీ పాతకాలం రోజుల్లోకి వెళ్లిపోయిందని , బాగా ఓల్డ్ గా ఉందని విమర్శలు వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , పాటలు కూడా కలిసి రాలేదని, ఇది తెలుగు నటీనటులు నటించిన తమిళ సినిమా అని తేల్చేసారు.
మరో ప్రక్క ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఊహించని డ్రాప్ కనిపించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అందుకు కారణం నాగచైతన్య ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేకపోవటమే కాకుండా..ఈ మధ్యకాలంలో వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు అంతగా హిట్ కాకపోవడమే అని చెప్తున్నారు. వాటిన్నటి ప్రభావం ఈ కస్టడీ సినిమాపై ఆ ప్రభావం పడిందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి (Aravind Swamy) విలన్ గా నటించారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్‌గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
