నాగచైతన్య.. ‘కస్టడీ’ స్టోరీ లైన్ ఇదే
కథ సింపుల్ గా ఉన్నా కూడా టైట్ స్క్రీన్ ప్లే తో…సినిమా ఫుల్ రేసీగా కథ సాగుతుంది. 48 గంటల్లో జరిగే కథ ఇది.
నాగచైతన్య(Naga Chaitanya) - వెంకట్ ప్రభు కలయికలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం‘కస్టడీ’ (Custody) రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం స్టోరీ లైన్ చాలా గమ్మత్తుగా ఉంటుందని,స్క్రీన్ ప్లే బేస్ గా సాగుతుందని సమాచారం. అదేమిటంటే..
ఏ సినిమాలో అయినా హీరో... విలన్ ని ఓడించాలి అనుకుంటాడు కానీ ఇక్కడ హీరో ...విలన్ ని ఓడించాలి అని ఉన్నా చంపాలి అని ఉన్నా కూడా…తనని ఎట్టి పరిస్థితులలో కూడా కాపాడాల్సిన భాద్యత హీరో మీద ఉంటుంది, అంటే హీరో చంపాలి అన్న కోపం విలన్ మీద ఉన్నా కూడా ఎలా తనని కాపాడే భాధ్యత తీసుకున్నాడు అన్నది ఓవరాల్ స్టొరీ పాయింట్.. కథ సింపుల్ గా ఉన్నా కూడా టైట్ స్క్రీన్ ప్లే తో…సినిమా ఫుల్ రేసీగా కథ సాగుతుంది. 48 గంటల్లో జరిగే కథ ఇది.
ఈ సినిమాలో ఆయన ఎ.శివ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ప్రమోషన్స్ చైతూని చూపించిన తీరును బట్టి.. సినిమాలో శివ తను నమ్మే సిద్ధాంతం కోసం సొంత వ్యవస్థతోనే పోరాటం చేయనున్నాడని అర్థమవుతోంది. ‘‘మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి’’ అనటం ఆసక్తిరేకెత్తిస్తోంది. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఆర్.కతీర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
అలాగే టీజర్ లోని 'ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు. నిజం ఒక ధైర్యం .. నిజం ఒక సైన్యం .. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది' అనే హీరో డైలాగ్ సినిమాపై ఆత్రుతను పెంచుతోంది. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.