నాగచైతన్య హీరోగా నటించిన `కస్టడీ` సినిమా శుక్రవారం విడుదలైంది. దీనికి ప్రారంభం నుంచి నెగిటివ్‌ టాక్‌ వస్తుంది. తాజాగా ఓటీటీ డిటెయిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

అక్కినేని హీరోలకు బ్యాక్‌ టైమ్‌ నడుస్తుంది. వరుసగా నాగార్జున, అఖిల్‌, నాగచైతన్య నటించిన సినిమాలు బోల్తా కొడుతున్నాయి. చైతూ నటించిన `కస్టడీ`పై ఎంతో నమ్మకంతో ఉన్నారు. కచ్చితంగా హిట్‌ కొట్టబోతున్నట్టు కాన్ఫడెంట్‌తో చెప్పారు. టీమ్‌ ప్రతి ఒక్కరిలో అదే కనిపించింది. చైతూ కూడా చాలా ఎగ్జైట్‌ అయ్యాడు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. శుక్రవారం విడుదలైన `కస్టడీ` తొలి ఆట నుంచి నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. కనీసం ఓపెనింగ్స్ కూడా లేకపోవడం గమనార్హం. 

తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు రూపొందించిన ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా కృతి శెట్టి నటించింది. వీరితోపాటు అరవింద సామి, ప్రియమణి, శరత్‌ కుమార్ నటించారు. అలాగే వంటలక్క, వైభవ్‌, రాంకీ వంటి వారు కూడా గెస్ట్ లుగా మెరిశారు. ఎంత స్టార్‌ కాస్టింగ్‌ ని యాడ్‌ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. సినిమాకి ఆయా పాత్రలు అడ్డుగానే మారాయి తప్ప, ప్లస్‌ కాలేదు. 

ఇందులో చైతూ పోలీస్ కానిస్టేబుల్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. తనవంతు కొత్తగా ప్రయత్నం చేశాడు. ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఏ ఓటీటీలో రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ప్రముఖ డిజిటల్‌ కంపెనీ నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ రేటుకే హక్కులు పొందిందని సమాచారం. ఇటీవల కాలంలో సినిమాలు నెగటివ్‌ టాక్‌ వస్తే నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తున్నాయి. `శాకుంతలం` వంటి చిత్రాలు అలానే వచ్చాయి. ఇప్పుడు నాగచైతన్య `కస్టడీ` కూడా త్వరగానే రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని వచ్చే నెల ప్రారంభంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. 

ఇదిలా ఉంటే `కస్టడీ` చిత్రం థియేట్రికల్‌గానూ, ఓటీటీ పరంగానూ మంచి రేటుకే అమ్ముడు పోయింది. రిలీజ్‌ కి ముందే నిర్మాతలు సేఫ్‌లో ఉన్నారు. సుమారు 23కోట్లకు థియేట్రికల్‌ రైట్స్ అమ్ముడు పోయాయి. తొలి రోజు నాలుగు కోట్ల గ్రాస్‌, రెండున్న కోట్ల షేర్‌ వచ్చిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. కానీ మేకర్స్ మాత్రం ఏడు కోట్ల గ్రాస్‌, మూడున్నర కోట్ల షేర్‌ అంటూ ప్రకటించడం గమనార్హం. వాస్తవ లెక్కల ప్రకారం ఈ సినిమా కొన్న బయ్యర్లు మాత్రం గట్టిగానే నష్టపోయే అవకాశం ఉంది. సగానికిపైగా నష్టాలు చవిచూసే ప్రమాదం ఉందని తెలుస్తుంది.