ఇప్పుడు ఈ స్ట్రాటజీ చాలా మంది యంగ్ హీరోలను రీమేక్ ల వైపు చూసేలా చేస్తోంది. తాజాగా నాగచైతన్య కూడా ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మార్పులు చేర్పులతో స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే అతి తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేయాలని చెప్పటం జరిగిందిట. ఆ వివరాల్లోకి వెళితే...
వరస పెట్టి రీమేక్ లతో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. నేటివిటీ మార్పులు చేయటం..తర్వాత తక్కువ రోజుల్లో సినిమా ఫినిష్ అయ్యేలా చూడటం, ప్రొడక్షన్ కంట్రోలులో ఉంచటం వంటి స్టాటజీలతో ముందుకు వెళ్తున్నారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ అలా వచ్చి సక్సెస్ అయ్యినవే. ఇప్పుడు ఈ స్ట్రాటజీ చాలా మంది యంగ్ హీరోలను రీమేక్ ల వైపు చూసేలా చేస్తోంది. తాజాగా నాగచైతన్య కూడా ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మార్పులు చేర్పులతో స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే అతి తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేయాలని చెప్పటం జరిగిందిట. ఆ వివరాల్లోకి వెళితే...
శింబు హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన తమిళ సినిమా 'మానాడు'. విడుదలకు ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ... విడుదలైన తర్వాత వసూళ్ల వర్షం కురిపించింది. తమిళనాట విమర్శలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు ధృవీకరించారు.
తెలుగు, హిందీ భాషల్లో 'మనాడు'ను రీమేక్ చేయనున్నట్టు వెంకట్ ప్రభు స్పష్టం చేశారు. అయితే... హీరోలు మారనున్నారు. తెలుగులో హీరోగా అక్కినేని నాగ చైతన్య కన్ఫర్మ్. హిందీలో ఎవరు చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు.అలాగే రెండు భాషల్లోనూ విలన్ సూర్య అని తెలుస్తోంది. 'సరోజ', 'గ్యాంబ్లర్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా వెంకట్ ప్రభు తెలుసు. అయితే... ఆయన ఇప్పటివరకూ తెలుగు సినిమా చేయలేదు. 'మనాడు' రీమేక్ ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమా అని చెప్పాలి.
మొన్న సంక్రాతికి బంగార్రాజు గా మన ముందుకు వచ్చాడు నాగచైతన్య. ఆ సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడీ రీమేక్ ప్రాజెక్టుతో యాక్షన్ ఇమేజ్ కోసం చైతూ ప్రయత్నిస్తున్నట్టుంది. ఇంతకుముందు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకీ మామ సినిమా చేశాడు చైతూ. మానాడు రీమేక్ కూడా అదే బ్యానర్ పై చేయబోతున్నట్లు సమాచారం. నాగచైతన్యకు సురేష్ ప్రొడక్షన్స్ లో ఇది రెండో సినిమా .
ఇక గతంలో 'ఏ మాయ చేసావె' తమిళ్ వెర్షన్‌లో శింబు హీరోగా నటించగా... తెలుగులో నాగ చైతన్య నటించారు. 'సాహసం శ్వాసగా సాగిపో'లో ఇక్కడ చైతన్య నటించగా... తమిళంలో శింబు చేశారు. అందువల్ల, 'మనాడు' రీమేక్ కూడా పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. 'మనాడు' రీమేక్‌లో నాగచైతన్యకు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్టు చెప్తున్నారు. ఇంకా ఫైనలైజ్ కాలేదు.
ప్రస్తుతం నాగచైతన్య చేతిలో ఉన్న సినిమాలకు వస్తే... ఆల్రెడీ 'థాంక్యూ' సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. ఇప్పుడు అదే దర్శకుడితో 'దూత' వెబ్ సిరీస్ చేస్తున్నారు. హిందీలో ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లోనూ నటించారు. 'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ సినిమా చర్చల దశలో ఉంది.
