Asianet News TeluguAsianet News Telugu

‘దూత’రిలీజ్ డేట్ ఫిక్స్, ఆలస్యానికి అసలు కారణం

మొత్తం 8 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ రానుందట. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని సమాచారం.  

Nag Chaitanya Dhootha OTT Release Date Locked? jsp
Author
First Published Nov 13, 2023, 4:46 PM IST | Last Updated Nov 13, 2023, 4:46 PM IST

  నాగచైతన్య ప్రస్తుతం యంగ్ డైరక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్​పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య తొలిసారిగా నటిస్తున్న వెబ్ సిరీస్ దూతను ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్​ సిరీస్​ను నిర్మిస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ హర్రర్ డ్రామా సిరీస్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

 ఈ సిరీస్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. కాగా, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన హార్రర్ డ్రామా వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఖరారైంది. కాగా, ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తొంది. మొత్తం 8 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ రానుందట. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రైమ్ వీడియోతో కలిసి శరద్ మరార్ నిర్మించారని సమాచారం.  ఈ హర్రర్ సిరీస్ తప్పకుండా ఆడియన్స్​ను థ్రిల్ చేయడంతో పాటు వెబ్​ సిరీస్​ల జానర్​లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్యకు మరింత క్రేజ్ తీసుకొస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో నాగచైతన్య నటించిన ‘మనం’, ‘థాంక్యూ’ సినిమాలకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. మళ్లీ నాగచైతన్య - విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ అనగానే అందరూ సినిమా అనుకున్నారు. కానీ, ఇది వెబ్ సిరీస్ అని కిందటేడాది ప్రకటించారు. కిందటేడాది మేలో షూటింగ్ ప్రారంభమైంది. ఆగస్టులో షూటింగ్ పూర్తయ్యింది. అయితే, అప్పటి నుంచీ అమెజాన్ ఈ సిరీస్‌ను పెండింగ్ పెడుతూ వచ్చింది. క్రేజ్ వచ్చాక సరైన టైమ్ చూసి రిలీజ్ చేస్తే వ్యూస్ వస్తాయని భావించి వాయిదాలు మీద వాయిదాలు వేస్తూ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు చైతు ప్రాజెక్టులపై పాజిటివ్ మొదలైంది. దాంతో ఈ సీరిస్ ని ఇప్పుడు విడుదల చేస్తోంది. ఈ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సిరీస్‌ను రూపొందించినట్టు సమాచారం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios