పెద్ద హీరోలను డైరక్ట్ చేసే దర్శకులపై అందరి దృష్టీ ఉంటుంది. వారు చేసే ప్రాజెక్టులను అందరూ గమనిస్తూంటారు. ముఖ్యంగా వారు చేసే ఇతర ప్రాజెక్టుల ఇంపాక్ట్ కూడా తాము డైరక్ట్ చేసే హీరోల సినిమాపై ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్, పిట్ట కథలు ఈ వారం రిలీజైంది. అయితే  అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ పూర్తి స్దాయిలో నిరాశపరిచింది. తరుణ్ భాస్కర్ రాములా మినహా మిగిలిన మూడు కథలన్నీ అసలు బాగోలేవు. శ్రుతి హాసన్ నటించిన నాగ్ అశ్విన్ యొక్క ఎక్స్-లైఫ్ అతిపెద్ద డిజాస్టర్  అని చెప్పాలి. 

నాగ్ అశ్విన్ చేసిన ఆంథాలజీ కాన్సెప్ట్  ‘ఎక్స్-లైఫ్’ ఆద్యంతం సైన్స్ ఫిక్షన్ టచ్ తో నడిచింది. విరుట్యువల్ రియాలిటీ,డేటా కంట్రోలింగ్ చుట్టూ తిరిగింది. దాంతో ప్రభాస్,నాగ్ అశ్విన్ తో చేయబోతున్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ కి దీనికి లింక్ పెట్టేస్తున్నారు. ఈ పిట్టకథ..ఆ సినిమాకు టీజర్ లాంటిదని ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రభాస్ ప్యాన్స్ కంగారు పడుతున్నారు. సినిమా కూడా ఇలా దారుణంగా ఉంటుందా అని సోషల్ మీడియాలో ప్రభాస్ యాంటి ఫ్యాన్స్ కామెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఈ వార్తలను ఖండించారు.

ఈ పిట్టకథకు, ప్రభాస్ తో చేయబోయే సినిమాకూ ఏ మాత్రం సంభందం లేదని తేల్చారు. రెండు కథలు వేరు అన్నారు. తాము ఎప్పుడో ఆ సినిమాకు సంబందించిన బౌండెడ్ స్క్రిప్టు రాసుకున్నామన్నారు. ప్రి ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ స్క్రిప్టుకు వర్క్ చేస్తున్నారు.ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్..జూలై కానీ ఆగస్టులో కానీ ప్రారంభం అవుతుంది.
  
నాగ్ అశ్విన్ ఇప్పటివరకు ఎవడే సుబ్రహ్మణ్యం మరియు మహానటి అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రెండు చిత్రాలు బాగా సెన్సిబుల్ గానే తీశాడని పేరు తెచ్చుకున్నాడు. పిట్ట కథలు అనేది కేవలం అనుకోని ఒక్క బ్యాడ్ ఎక్సపీరియెన్స్. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ మరియు సలార్ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.  

ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కథ తో ఉన్న సినిమా రాలేదని ప్రీ ప్రొడక్షన్ పనులకు సమయం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతోందని నాగ్ అశ్విన్ చెప్తున్నాడు.   సమ్మర్ మధ్యలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పాడు. సినిమా మొదలైతే అస్సలు ఆగదని ఏడాది సమయంలో ప్రాజెక్ట్ పూర్తయ్యేలా ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ అవుతున్నట్లు నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చారు. ఇక సినిమాల్ లో హీరోయిన్ దీపికా పదుకొనె అని చిత్ర యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.