'సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో..నేచురల్ స్టార్ నాని. వింటానికే విచిత్రంగా ఉంది కదా..? అసలు సంబంధమే లేని కాంబినేషన్ లో సినిమా ఏంటీ..? మరి ఈన్యూస్ లో నిజం ఎంత..? ఏంటీ కథ చూద్దాం.
కొన్ని కాంబినేషన్లు అనుకోకుండా.. అనూహ్యంగా కలుస్తాయి. అసలు ఈ కాబినేషన్ లో సినిమానా అని అంతా షాక్ అయ్యేలా చేస్తాయి. ఈ కాంబినేషన్ కు భషతో సబంధం లేదు. ప్రాంతంతో సంబంధం లేదు... ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులతో చూసుకుంటే స్టార్ డమ్ తో కూడా సబంధం లేదు. అలాంటి కాంబినేషన్ ఒకటి వెండితెరపై సందడి చేయబోతోంది. అటు తమిళ,ఇటు తెలుగు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతోంది కాంబో. ఇంతకీ ఎవరా కాంబో.. ఏంటా సినిమా..?
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. హీరోలు అనే మాట ఒక్కటి తప్పించి.. ఈ ఇద్దరికి ఎక్కడా సబంధమే లేదు. కాని ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోందట. ఇది ఎంత వరకూ నిజం. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ జైలర్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుది. ఇక ఈసినిమా రిలీజ్ తరువాత ఆయన ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈసినిమాకు సంబంధించి వర్క్ ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది.
సామాజికాంశాలను చర్చిస్తూ ఈసినిమా సాగుతుందని, యథార్ధ ఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
అంతే కాదు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టాలీవుడ్ హీరో నాని ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కథ నచ్చడంతో పాటు రజనీకాంత్ వంటి అగ్ర నటుడితో తెరను పంచుకునే అవకాశం ఉండటంతో ఈ సినిమాలో నటించడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
అయితే ఈ న్యూస్ ఇప్పటి వరకూ ఎవరూ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం హయ్ నాన్న సినిమాల్ నటిస్తున్నారు. తండ్రీకూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
