Asianet News TeluguAsianet News Telugu

‘నాంది’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

నాంది రిలీజ్ అయిన థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. చాలా  సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. రెవిన్యూ పరంగా చూసుకుంటే నాంది కి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దానికి తోడు నాంది సినిమాని చాలా తక్కువ రేట్లకు అమ్మటంతో దాదాపు తెలంగాణా ఇప్పటికే అందరూ పెట్టుబడి తెచ్చేసుకుని, ప్రాఫెట్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నారు. 

Naandhi enters into the profit zone jsp
Author
Hyderabad, First Published Feb 23, 2021, 7:31 PM IST

అల్లరి నరేష్ తాజా సినిమా ‘నాంది’. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదట్లో పెద్దగా పికప్ కాలేదు. టాక్ కూడా పెద్దగా రాలేదు. ఓ వర్గానికే పరిమితం అయ్యింది. దానికి తోడు అదే రోజు విశాల్ యాక్షన్ మూవీ చక్ర, కన్నడ డబ్బింగ్ పొగరు, సుమంత్ కపటధారి సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఈ క్రమంలో నాంది సినిమాకి మార్నింగ్ షో, మ్యాట్నీ కలెక్షన్స్ బాగా డల్ గా ఉన్నాయి. అయితే మౌత్ టాక్ స్ప్రెడ్ అవడం వలన ఫస్ట్ షో, సెకండ్ షో ల కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. ఓవరాల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ మామూలుగానే ఉన్నా.. నాంది సినిమాకి మాత్రం అటు పబ్లిక్ నుండి ఇటు మీడియా నుండి కూడా కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది.


నాంది రిలీజ్ అయిన థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. చాలా  సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. రెవిన్యూ పరంగా చూసుకుంటే నాంది కి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దానికి తోడు నాంది సినిమాని చాలా తక్కువ రేట్లకు అమ్మటంతో దాదాపు తెలంగాణా ఇప్పటికే అందరూ పెట్టుబడి తెచ్చేసుకుని, ప్రాఫెట్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ వీకెండ్ కు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే సీన్ కనపడనుందని ట్రేడ్ వర్గాల సమాచారం.  

నాంది సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ ...ఎప్పుడో 2012 లో సుడిగాడు సినిమా విడుదలైనప్పుడు విన్నాను ఈ సక్సెస్ టాక్ అనేది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళి ఈరోజు ఈ సక్సెస్ టాక్ వింటున్నా.. అంటూ చెమర్చిన కళ్లతో ఉద్వేగానికి లోనవడం అందరిని కదిలించింది. ఇప్పటికే నాంది సినిమాలో అల్లరి నరేష్ నటనకు అంతటా ప్రశంశలు లభిస్తున్నాయి. చాలామంది నరేష్ కి నాంది లాంటి విజయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios