వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకుంది మైత్రి మూవీ మేకర్స్. మహేష్ బాబు తో 'శ్రీమంతుడు', ఎన్టీఆర్ తో 'జనతాగ్యారేజ్', రామ్ చరణ్ తో 'రంగస్థలం' సినిమాలను నిర్మించి టాప్ రేసులో దూసుకుపోయింది ఈ నిర్మాణ సంస్థ.

'రంగస్థలం' సినిమా హిట్ తరువాత ఈ బ్యానర్ మరింత దూకుడు ప్రదర్శించే విధంగా వచ్చే ఏడాదిలో పది సినిమాలు విడుదల చేస్తామని అనౌన్స్ చేసింది. వచ్చే ఏడాదిలో నెలకి లేదా రెండు నెలలకి ఓ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని మైత్రి నిర్మాతలు ప్రకటించారు. 

కానీ రీసెంట్ గా ఈ బ్యానర్ లో వచ్చిన 'సవ్యసాచి', 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ రావడంతో మైత్రి మూవీ మేకర్స్ తమ పది సినిమాల ఆలోచన పక్కన పెట్టేసింది. 

విజయ్ దేవరకొండతో చేస్తోన్న 'డియర్ కామ్రేడ్' తప్పించి, ఈ బ్యానర్ లో చేయాలనుకుంటున్న అన్ని సినిమాల స్క్రిప్ట్స్ ని మరొకసారి వింటున్నారని, ఏదైనా కథ తేడాగా అనిపిస్తే పక్కన పెట్టాలని భావిస్తున్నారట.