‘పుష్ప’: అదే జరిగితే మునిగిపోతాం..సుక్కూకి నిర్మాత వార్నింగ్?

 అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక హీరోయిన్. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు మొదటి నుంచి సూపర్‌ క్రేజ్‌ ఉంది. 

Mythri Movie Makers pass special instructions to Sukumar? JSP

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసి తెరకెక్కుతున్న సినిమా పుష్ప. డైరక్టర్ సుకుమార్ ఎప్పటిలాగే అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే సినిమాను ఓ లెవల్ లో హైప్ క్రియేట్ చేసేసాయి. అయితే.. అన్ని సినిమాలాగానే ఈ సినిమాకు కూడా కరోనాతో  బ్రేకులు పడ్డాయి.సెకండ్ వేవ్ ప్రభావం తగ్గటంతో త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే ధర్డ్ వేవ్ భయం అందరిలో ఉంది. ఎప్పుడొచ్చి మీద పడుతుందో మళ్లీ అన్ని పనులు ఆగిపోతాయో సినిమావాళ్లు ప్రతీ క్షణం భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు ..డైరక్టర్ తో కలిసి కూర్చుని మిగిలిన షూటింగ్ విషయమై డిస్కస్ చేసారని సమాచారం.

అంతర్గత వర్గాల సమాచారం మేరకు..సాధ్యమైనంత త్వరగా సినిమా ని పూర్తి చేయమని, డేట్స్ వేస్ట్ అయితే పట్టుకోవటం కష్టమని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చిందంటే చాలా ఇబ్బంది అయ్యిపోతుందని నిర్మాతలు..దర్శకుడు సుకుమార్ ని హెచ్చరించారుట. సాధారణంగా సుకుమార్ సినిమాలు చాలా టైమ్ తీసుకుంటాయి షూటింగ్ లకు. అటువంటిది రిపీట్ కాకూడదని భావిస్తున్నారట. అలాగే మొదటి పార్ట్ కు సంభందించిన పని త్వరగా పూర్తి చేసేయమన్నారు. తమకు బిజినెస్ పరంగా ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఇలా చెప్పటం జరిగిందిట. 

తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు మొదటి నుంచి సూపర్‌ క్రేజ్‌ ఉంది.  ‘పుష్ప’ను తొలుత అనుకున్న కథ ప్రకారం ఒక భాగంగా తీయాలని భావించారు. అయితే, ఒక భాగంలో కథను పూర్తి చేస్తే, అసంపూర్తిగా ఉంటుందని భావించిన చిత్ర టీమ్ రెండు భాగాలుగా విడుదల చేయనుంది.  శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
  
ఇక ఇప్పటికే సినిమాలో కీలకమైన కొంత భాగాన్ని కేరళలో, ముఖ్యమైన ఫారెస్ట్ సన్నివేశాలను ఏపీలోని మారేడుమిల్లి, తమిళనాడులోని తెన్ కాశీ పరిసరాలలో షూటింగ్ నిర్వహించారు.  తదుపరి షెడ్యూల్ ను వాయిదా వేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. దానికి ఇంకా మూడున్నర నెలల సమయం ఉండగా అప్పటికి షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటుంటున్నారు.
 
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సౌండ్‌ డిజైనర్‌గా ఆస్కార్‌ విజేత పూకుట్టిని తీసుకున్నట్టు  ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios