సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా కామన్ అనే చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి కేసులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ఇలాంటి చాలా మంది హీరోల వైవాహిక జీవితంలో విబేధాలు ఏర్పడ్డాయి.

ఇప్పుడు ఈ లిస్ట్ లో నటుడు అర్జున్ రామ్ పాల్ కూడా చేరాడు. దాదాపు ఇరవై ఏళ్ల పాటు కాపురం చేసిన తన భార్యకు విడాకులిచ్చి ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. గతేడాది తన భార్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించాడు.

1998లో మెహ్ర్ ని వివాహం చేసుకున్న అర్జున్ కి ఇప్పుడు టీనేజ్ వయసొచ్చిన ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కానీ అర్జున్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ విషయమేమిటంటే.. తన గర్ల్ ఫ్రెండ్ ని టీనేజ్ కూతుర్లు యాక్సెప్ట్ చేసినట్లు అర్జున్ స్వయంగా వెల్లడించాడు.

అంతేకాదు.. తన భార్య కారణంగా ఐదేళ్ల పాటు నరకం చూశానని చెప్పాడు. రెండేళ్ల పాటు తన విదేశీ గర్ల్ ఫ్రెండ్ తో రహస్యంగా డేటింగ్ చేసిన అర్జున్ ఆ తరువాత ఓపెన్ అయిపోయాడు. ప్రస్తుతం అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెలా గర్భవతి. ఆగస్ట్ లో ఈమె తన బిడ్డకు జన్మనివ్వనుంది.