బుధవారం జూనియర్‌ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా మోత మొగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్‌కు తమదైన స్టైల్‌లో విషెస్‌ తెలియజేశారు. Happy Birthday NTR అనే హ్యాష్ ట్యాగ్ బుధవారం జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది. యంగ్ హీరోలు కాస్త డిఫరెంట్‌గా ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్ ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ ఎన్టీఆర్‌ స్టెప్‌కు డ్యాన్స్ చేసి విష్ చేయగా, ఫలక్‌నుమా దాస్‌ ఫేం విశ్వక్‌ సేన్‌ రాప్ సాంగ్‌తో ఎన్టీఆర్‌కు విషెస్‌ తెలిపాడు.

అయితే ఇప్పుడు ఈ వీడియో మీదే రచ్చ మొదలైంది. విశ్వక్‌ సేన్‌ ఈ పాటకు సంగీతం వివేక్‌ సాగర్ ఇచ్చినట్టుగా క్రెడిట్ ఇచ్చి మరీ పాటను రిలీజ్ చేశాడు. అయితే ఈ విషయంపై నటుడు అభినవ్‌ గోమటం, వివేక్‌ సాగర్‌ల మధ్య సోషల్‌ మీడియాలో ఘాటుగా చర్చ జరిగింది. అసలు ఈ మ్యూజిక్‌ను ఓ సినిమాలో ఓఎస్‌టీ కోసం ట్యూన్ చేశారు. ఈ ఇదే విషయాన్ని చెప్పిన వివేక్‌ సాగర్‌. నా పాటను బర్త్ డే విష్‌ కోసం ట్యూన్ చేయలేదంటూ కామెంట్ చేశాడు. అయితే అభినవ్ ఆ మ్యూజిక్‌ బాగుందని మాత్రమే కామెంట్ చేశానంటూ సర్థిచెప్పే ప్రయత్నం చేశాడు.

అంతేకాదు విశ్వక్‌ సేన్‌కు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. `నువ్వు రూపొందించిన వీడియోతో నాకు సంబంధం లేదు. నేను నా ట్రాక్‌ వినియోగించవద్దని చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నువ్వు చెప్పినట్టు వినలేదు. నువ్వు ఆ పాటలోని వైబ్‌ను చంపేశావు. నీ యాటిట్యూడ్‌తో నేను పూర్తిగా నిరాశ చెందాను` అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు నీ పోస్ట్‌లలో నన్ను ట్యాగ్ చేయవద్దు అంటూ కామెంట్ చేశాడు. అయితే అభిమానులు ఈ విషయంలో ఫైర్‌ అవుతున్నారు ఇలాంటి టాలెంట్‌ను కాపీ చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.