‘మిస్ యూ నాన్న’.. తండ్రిని తలుచుకుంటూ థమన్ భావోద్వేగం.. 11 ఏళ్లకే..
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 28 ఏళ్లు గడిచిపోయింది నాన్న అంటూ భావోద్వేగమయ్యారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
సెన్సేషనల్ అండ్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman S) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 14 ఏళ్ల పాటు తన సంగీతం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా థమన్ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటుంటున్నారు. కానీ తాజాగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగమయ్యారు. ఆయన ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్ ఈయన 1997లో తుదిశ్వాస విడిచారు. నేటితో 28 ఏళ్లు గడిచింది. 11 ఏళ్ల వయస్సులోనే థమన్ తండ్రిని కోల్పోయారు. ఈ సందర్భంగా థమన్ తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగమయ్యారు. తాజాగా ట్వీటర్ (X)లో తండ్రి ఫొటోను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ‘మిస్ యూ నాన్న.. మీరు మమ్మల్మి విడిచిపెట్టి 28 ఏళ్లు గడిచిపోయింది. అయినా మీరు మా చుట్టే ఉన్నారు. మమ్మల్ని నడిపిస్తున్నారు. ఐ లవ్ యూ నాన్న’ అంటూ పోస్ట్ పెట్టారు.
థమన్ చెన్నైలో 1983లో ఘంటసాల శివకుమార్ - సావిత్రి దంపతులకు జన్మించారు. థమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. స్క్రీన్ నేమ్ ను థమన్ గా స్వీకరించారు. అయితే, ప్రముఖ దర్శకుడు, ప్రొడ్యూసర్ ఘంటసాల బాలరామయ్య మనవడే థమన్. తండ్రి శివకుమార్ కూడా సంగీత రంగానికి చెందిన వాడే. ఆయన డ్రమ్మర్ గా ప్రసిద్ధి చెందారు. మ్యూజిక్ డైరెక్టర్ కే చక్రవర్తి వద్ద 700 సినిమాల వరకు వర్క్ చేశారు. ఇక థమన్ తల్లి సావిత్రి, సోదరి యామిని, రిలేటీవ్ వసంత ప్లే బ్యాక్ సింగర్ గా ఉన్నారు.
థమన్ తన 14 ఏళ్ల కేరీర్ లో వందకు పైగా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అందించారు. ఇతర భాషల్లోనూ తన సత్తా చూపించారు. ప్రస్తుతం భారీ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే థమన్ సంగీతం అందించిన ‘స్కంద’ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నెక్ట్స్ ‘భగవంత్ కేసరి’ ఆన్ ది వేలో ఉంది. ఇక మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, నాయనతార 75వ చిత్రం, RT4GM చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈనెల 28న లండన్ లో థమన్ లైవ్ పెర్ఫామెన్స్ కూడా ఇవ్వబోతున్నారు. భారీ స్థాయిలో ఈవెంట్ జరగబోతోంది.