'అరవింద సమేత' షూటింగ్ లో ఎన్టీఆర్.. థమన్ కామెంట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Sep 2018, 10:36 AM IST
music director thaman comments on ntr
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం మధ్యాహ్నం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరిగింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం మధ్యాహ్నం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరిగింది. ఈ విషయాన్ని థమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''ఈరోజు(ఆదివారం) భావోద్వేగపు రోజు. తారక్ అన్న ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు.

ఆయన సెట్స్ లో డాన్స్ చేస్తూ మళ్లీ ఎనర్జిటిక్ గా మారిపోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. మీరు మరింత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నా. 'అరవింద సమేత; టీమ్ నుండి మీకు లాట్స్ ఆఫ్ లవ్. ఈ వారంలోనే ఆడియో అప్ డేట్స్ ఇస్తాం'' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వినాయక చవితి సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రం విడుదల చేయనుంది చిత్రబృందం.

హరికృష్ణ మరణాంతరం ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా..? లేదా..? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ తారక్ రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటూ చిత్రబృందానికి సహకరిస్తున్నారు.

 

loader