ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కోటితో కలిసి ఆయన గతంలో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కోటితో కలిసి ఆయన గతంలో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుకు గురైన రాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. రాజ్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. 

కాగా.. 90వ దశకంలో రాజ్ కోటి జంటకు మంచి డిమాండ్ వచ్చింది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అది ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీలో వుండేది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో వుండగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరి దారులు వేరయ్యారు. ఇద్దరూ కలిసి విడివిడిగా సినిమాలు చేసుకున్నారు.