యంగ్ మ్యూజిక్  డైరెక్టర్.. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ జీఎస్టీ చిక్కుల్లో పడ్డారు. తనకు సబంధం లేకపోయినా.. కోట్ల రూపాయల టాక్స్ తనపై వేశారంటూ కోర్డును ఆశ్రయించారు ప్రకాశ్. ఇంతకీ అసలు విషయం ఏంటీ..?  

మన సౌత్‌ సినిమాల్లో మల్టీ టాలెంటెడ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వారిలో జీవి ప్రకాశ్‌ ఒకరు. ఏఆర్‌ రెహమాన్‌ ను ఆదర్శంగా తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రకాశ్.. ఆతరువాత హీరోగా వెండితెరపై సందడి చేశాడు. 

హిట్టు సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్ గా పనిచేసిన జీవి ప్రకాశ్.. నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉన్న టైమ్ లో.. తనలోని నటుడిని సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశాడు ప్రకాశ్. నటుడిగా కూడా శభేష్‌ అనిపించుకుంటున్నాడు. ఒక వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూనే.. మరో వైపు యాక్టర్ గా కూడా రాణిస్తున్నాడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు. ఇక రీసెంట్ గా టాక్స్ చిక్కుల్లో ఇరుక్కున్న జీవి ప్రకాశ్.. కోర్టు, కేసులు అంటూ తిరుగుతున్నాడు. టాక్స్ సమస్యలతో సతమవుతున్నారు.

ఇంతకీ అసలువిషయం ఏంటీ అంటే.. కొంత కాలం క్రితం ఇన్ కమ్ టాక్స్ అధికారుల నుంచి జీవీ ప్రకాశ్‌కు ఓ నోటీసు ఇచ్చారు. జీవి ప్రకాశ్‌ సంగీతం అందించిన మ్యూజిక్ పై వాటి హక్కులకు సబంధించిన 1.84 కోట్ల సర్వీస్‌ టాక్స్‌ కట్టాలని నోటీసులు పంపించారు. జీఎస్టీ జాయింట్ కమీషనర్ నుంచి ఈ నోటీసులు ప్రకాశ్ కు అందాయి. నాలుగు వారాల్లోపు నోటీసులపై స్పందించాలని కూడా అందులో ఉంది. దీంతో జీవీ ప్రకాశ్‌ షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా అన్ని కోట్లు ఎలా కట్టాలని ప్రకాశ్ వాపోయారు. అంతే కాదు ఈ విషయంలో ఆయన చెన్నై హై కోర్టును ఆశ్రయించారు. 

టాక్స్ నోటీస్ ల విషయంలో ప్రకాశ్ కోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లో జీవి ప్రకాశ్ ఏ విషయాలు వివరిచారంటే.. ? నేను సమకూర్చిన సంగీతం కాపీరైట్స్‌ నా దగ్గర లేవు. నేను వాటిని సినిమా నిర్మాతలకు శాశ్వతంగా ఇచ్చేశాను. వాటన్నిటికి వారే నిజమైన యజమానులు అలాంటప్పుడు ..వాటిపై నా నుంచి టాక్స్‌ తీసుకోవాలనుకోవటం చట్టవిరుద్దం అని పిటీషన్ లో పేర్కోన్నారు ప్రకాశ్. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇన్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో వెంటనే స్పందించాలని ఆదేశించింది. 

ఇక ఇప్పుడు జీవి ప్రకాశ్‌ విషయం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలువురు సినీ దర్శకులు జీవీకి మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టు నుంచి జీఎస్టీ కమిషనర్‌ అధికారాలకు అనకూలంగా తీర్పు వచ్చి.. జీవీ ప్రకాశ్‌ టాక్స్ కట్టాలి అని అంటే.. ఇక సినిమా ఇండస్ట్రీలోని మిగిలిన సంగీత దర్శకులు కూడా తాము సమకూర్చిన సంగీతంపై సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయంలో అంతా ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలి అని చర్చించుకుంటున్నట్టు సమాచారం.