`పుష్ప` ఆస్కార్‌కి వెళ్లాల్సిన మూవీ.. దేవిశ్రీ ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

`పుష్ప` సినిమా ఇటీవల రెండు జాతీయ అవార్డులను సాధించిన విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ ఆస్కార్ కి వెళ్లాల్సిన మూవీ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ అన్నారు.

music director devi sri prasad interesting statement on pushpa it should goes to oscar arj

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి మొదట మిశ్రమ స్పందన లభించినా, ఆ తర్వాత అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ దుమ్మురేపింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుకుమార్‌ మ్యాజిక్‌, అల్లు అర్జున్‌ విశ్వరూపం, రష్మిక అందాలు, సమంత ఐటెమ్‌ సాంగ్‌ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాకి ఇటీవల రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. 

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌ అవార్డు దక్కింది. మరోవైపు మ్యూజిక్‌ విభాగంలో దేవి శ్రీ ప్రసాద్‌ నేషనల్‌ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో మరోసారి `పుష్ప` వార్తల్లో నిలిచింది. తరచూ చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. `పుష్ప` ఆస్కార్‌కి వెళ్లాల్సిన మూవీ అని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

music director devi sri prasad interesting statement on pushpa it should goes to oscar arj

`పుష్ప` ఆస్కార్‌కి పంపించాల్సిన సినిమా అని, కానీ నిర్మాతలు ఎందుకు పంపలేదో తెలియడం లేదన్నారు. ఒకవేళ ఆస్కార్‌ అవార్డుల కోసం పంపించే ఉంటే కచ్చితంగా సెలబ్రేట్‌ చేసుకునే వార్త వినే వాళ్లమని తెలిపారు. తాజాగా దేవిశ్రీప్రసాద్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇందులో ఆయన ఇంకా మాట్లాడుతూ భవిష్యత్‌లో ఆస్కార్‌ అందుకోవాలనే గోల్‌ పెట్టుకున్నారనే ప్రశ్నకి తాను స్పందిస్తూ, అవార్డుల కోసం తానెప్పుడూ మ్యూజిక్‌ చేయనని తెలిపారు. ఆడియెన్స్ ని అలరించాలని, ఎక్కువ మందికి తమ మ్యూజిక్‌ రీచ్ కావాలనేదే తన మైండ్‌లో ఉంటుందన్నారు. కానీ తెలుగు సినిమా ఆస్కార్‌కి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ ఆస్కార్‌ సాధించిన విషయం తెలిసిందే. ఓరిజినల్‌ సాంగ్‌ విభాగంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, పాట రచయిత సుభాష్‌ చంద్రబోస్‌ ఆస్కార్‌ని గెలుచుకున్నారు. ఆస్కార్‌ సాధించిన తొలి ఇండియన్‌ మూవీగా `ఆర్‌ఆర్‌ఆర్‌` నిలిచింది. దీనికి కీరవాణి సంగీతం అందించారు. `నాటు నాటు` పాటకి ఆస్కార్‌ దక్కింది. 

ఇదిలా ఉంటే సుకుమార్‌ దర్శకత్వం వహించిన `పుష్ప`కి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఇందులో పాటలన్నీ మంచి ఆదరణ పొందాయి. ప్రతి పాట వంద మిలియన్స్ వ్యూస్‌ దాటింది. ముఖ్యంగా `ఊ అంటావా మావ`, `శ్రీవల్లి`, `నా సామి`, `దాక్కో దాక్కో మేక` వంటి పాటలు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా, `ఊ అంటావా మావ` పాటలో సమంత స్టెప్పులేసింది. తాజాగా ఈ చిత్రానికి రెండో పార్ట్ రూపొందుతుంది. `పుష్ప 2`గా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. 

మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడం, పైగా రెండు జాతీయ అవార్డులు రావడంతో రెండో భాగాన్ని మరింత భారీగా, లార్జ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios