Asianet News TeluguAsianet News Telugu

ఖైదీ నెంబర్ 150 పై మురుగదాస్ అసంతృప్తి

  • ఖైదీ నెంబర్ 150 పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మురుగదాస్
  • కామెడీ కాస్త ఎక్కువైందని, హీరో మందు కొట్టే సీన్ నచ్చలేదన్న మురుగదాస్
  • ఆలీతో ఆడవేషం వేయించి తీసిన కామెడీపై మురుగదాస్ అసంతృప్తి
murugadoss unhappy with khaidi

ఏ.ఆర్.మురుగదాస్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న డైరక్టర్. ఈ దర్శకుడు తెరకెక్కించే చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు కావాల్సిందే. అలాంటిదే "కత్తి" చిత్రం. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్నే మెగాస్టార్ చిరంజీవి తెలుగులో "ఖైదీ నంబర్ 150" పేరుతో రీమేక్ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తూ.. కనకవర్షం కురిపిస్తోంది. పైగా.. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 

అయితే, ఈ సినిమా చూసిన మురుగ‌దాస్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. అందుకు మంచి కారణం ఉందట. తెలుగులో ఖైదీ (కత్తి) చిత్రానికి వివి.వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర ప్రదర్శనను వీక్షించిన మురుగదాస్ స్పందిస్తూ సినిమా అంతా బాగానే ఉందని అన్నాడు. అందులో క‌నిపించిన‌ కొన్ని సీన్లపై మాత్రం అభ్యంత‌రంగా ఉన్నాయన్నారు. తన సినిమాలో కొన్ని విలువ‌లు ఉండాల‌ని కోరుకుంటానని, అందుకే తన చిత్రాల్లో ఆల్కహాల్‌ సీన్లు ఉండకుండా చూస్తానని వ్యాఖ్యానించాడట. 

 

అందుకే తమిళ 'కత్తి' చిత్రంలో కనీసం విలన్ కూడా ఆల్క‌హాల్ తీసుకోడు. కేవ‌లం టీ, కాఫీలను మాత్ర‌మే హీరోలు, విలన్లు సేవిస్తుంటారు. కానీ, తెలుగు 'ఖైదీ'లో మాత్రం ఏకంగా హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం ఆయ‌న‌కు నచ్చలేదట. దీంతో పాటు క‌మెడియ‌న్‌ అలీతో సినిమాలో ఆడవేషం వేయించిన తీసిన‌ కామెడీ కూడా ఆయనకు అసంతృప్తి కలిగించినట్టు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios