ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్‌కు మాతృవియోగం కలిగింది.గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లి వసుమతి దేవి నేడు కన్నుమూశారు. మానవరాళ్ల పెళ్లిళ్లకు సైతం ఆమె చేతుల మీదుగా జరిగాయని గతంలో మురళీమోహన్ తెలిపారు. 

నిండు నూరేళ్ల వయసులో గురువారం తుది శ్వాసను విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేదని విశాఖపట్నంలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లారు. అయితే కోలుకుంటున్నారు అనుకున్న సమయంలో ఉదయమే వసుమతి దేవిగారు కన్నుమూశారు. 

మురళి మోహన్ కుటుంబ సభ్యులు సన్నిహితులు వెంటనే వారి ఇంటికి చేరుకొని తల్లికి నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్ధం రాజమహేంద్రవరంలోని నివాసంలో పార్థీవదేహాన్ని ఉంచారు. శుక్రవారం అంత్యక్రియలు జరపనున్నారు.