సంజయ్ దత్ రెడీ..మరి మెగాస్టార్ ఏమంటరో. అందేంటి.. సంజయ్ దత్, మెగాస్టార్ కలిసి ఏమన్నా సినిమా చేస్తున్నారా అని డౌట్ రావచ్చు. కాని అది కాదు విషయం. ఇంతకీ అసలు సంగతేంటంటే.
బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా సిరీస్ మున్నాభాయ్. బీ టౌన్ లో ఈ సినిమాలు సృష్టించిన రికార్డ్స్ అందరికి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ రూపొందించిన ఈసినిమాలు అద్భుతాన్ని సృష్టించాయి.
మున్నాభాయ్ ఎంబీబీఎస్,లగేరహో మున్నాభాయ్ రెండు సినిమాలు బాలీవుడ్ లో అయితే మంచి సక్సెస్ అయ్యాయి కాని. ఈ సినిమాలు తెలుగులో మెగాస్టార్ చీరంజీవి రీమేక్ చేయగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని సెకండ్ పార్ట్ మూవీ శంకర్ దాదా జిందాబాద్ మాత్రం టాలీవుడ్ లో సరిగ్గా ఆడలేదు.
ఇక ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో సినిమా చేయాలని సంజయ్‌దత్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ అనుకుంటున్నారట. రీసెంట్ గా సంజయ్‌దత్‌ను అభిమానులు మున్నాభాయ్ మూడో సినిమా గురించి అడిగారు. సంజయ్‌దత్ మాట్లాడుతూ…ఆ సినిమా చేయాలని నాకూ కోరికే. నేనూ, రాజ్‌హిరాణీ కలిసి ఆ మూడో సినిమా ఎప్పుడనేది మీరు దర్శకుడినే అడగాలి అన్నారు.
ఇక మున్నాభాయ్ మూడో సినమాకు సంజయ్ దత్ రెడీగానే ఉన్నాడు.ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు కాని మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా రీమేక్ చేస్తారా లేదా అని ఆలోచనలో పడ్డారు. శంకర్ దాదా జిందాబాద్ గట్టిగా దెబ్బకొట్టింది. అదీ కాకా ఇప్పుడు మెగాస్టార్ దాదాపు 5 సినిమాలు వెనకేసుకుని ఉన్నారు. మరికొన్ని కథలు కూడా హోల్డ్ లో పెట్టారు. మరి ఈ బిజీలో ఈ సినిమా చేసే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.
అయినా ఇంకా హిందీలోనే ఈ ప్రాజెక్ట్ కన్ ఫార్మ్ కాలేదు. అక్కడ ఒకే అయ్యి.. సినిమా స్టార్ట్ అయ్యి.. హిట్ అయ్యి.. ఎంత టైమ్ పడుతోందో తెలియదు కనుక. ఈలోపు ఈసినిమా జయాపజయాల ప్రభావంతో మెగాస్టార్ మున్నాభాయ్ పార్ట్3 రీమేక్ చేసినా చేయవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి మెగాస్టార్ ఏం చేస్తారో చూడాలి.
