Krishna Mukunda Murari: బుల్లితెరపై ప్రసారమవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ అందరి మన్ననలు పొందుతూ సక్సెస్ ఫుల్ గా ముందుకి సాగుతుంది. అంతేకాకుండా మంచి కథతో ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో భవాని పిలవడంతో ఆమె దగ్గరికి వస్తాడు మురారి. నేను ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఎవరిని నొప్పించకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను కానీ ఈ మధ్యన అలా జరగటం లేదు. ఈశ్వర్, ప్రసాద్, మధుకర్, అలేఖ్య ఈ నలుగురు వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. కోడళ్ళ మధ్య కూడా విభేదాలు వస్తున్నాయి. రేవతి నువ్వు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ నిలదీస్తుంది భవాని.

ఇందులో రేవతి అక్కయ్య తప్పులేదు ముకుంద పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతుంది రేవతి అక్కయ్య ఏం చేసినా తను తప్పుగానే అర్థం చేసుకుంటుంది. కృష్ణుని తోడిచ్చి పంపించడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంటుంది చిన్న తోటి కోడలు. టికెట్స్ బుక్ చేసినప్పుడు కానీ తను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు గానీ రేవతి నాకు ఆ విషయం చెప్పలేదు అంటుంది భవాని.

ముందుగా మీకు చెప్పకపోవడం నా తప్పే నేను మీ అంత బాగా నిర్ణయాలు తీసుకోలేకపోయాను. కృష్ణుని మురారితో పంపిస్తే ముకుందా ఇలా అర్థం చేసుకుంటుందని ఇంతగా బాధపడుతుందని నేను అనుకోలేదు. భార్యాభర్తలతో పాటు వేరొకరిని పంపిస్తే తప్పు కానీ వదిన, మరిదిలతో కృష్ణని పంపించడం తప్పని నాకు తెలియదు అంటుంది రేవతి. ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచి కృష్ణ ఎక్కడికి వెళ్లాలి అనుకోలేదు. తను జూనియర్ డాక్టర్ గారికి జాయిన్ అవ్వటానికి ఇంకా టైం పడుతుంది.

ఆదర్శ రావటానికి తన వంతు ప్రయత్నం కూడా చేసింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరు ఆలోచించాలి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి నిన్ను కాక మొన్న వచ్చిన కృష్ణ ఆ విషయాన్ని గ్రహించింది కానీ ముకుందా ఇంకా ఆ విషయాన్ని తెలుసుకోలేక పోతుంది అంటాడు మురారి. పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి మురారి నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి అనుకుంటుంది ముకుంద. ఎవరికి వాళ్లు బానే చెప్తున్నారు మధ్యలో నా పెద్దరికం ఏమైంది ముందుగా చెప్పడంలో తప్పేముంది అంటుంది భవాని.

ముకుంద, రేవతికి క్షమాపణ చెప్పి నేను మీతో అలాగా మాట్లాడి ఉండకూడదు. నేను ఎప్పటికీ మీ ఇంట్లో ఉండవలసిన దానినే, అందరితోనే కలిసి ఉండవలసిన దాన్ని మీరు నన్ను వేరు చేస్తున్నారని అపార్థం చేసుకున్నాను అంటుంది ముకుంద. తప్పంతా నాదే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు అన్నీ తప్పుగానే కనిపిస్తున్నాయి. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా మాట్లాడేసాను క్షమించండి అంటూ భవానిని క్షమాపణ అడుగుతుంది ముకుంద.

ఎవరు వీలైతే చూపించకు ముందే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే మంచిది ఈ ఇంట్లో ఎవరికీ ఈగోలు ఉండకూడదు అంటూ ఆదర్శ్ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. వచ్చాను పెద్ద అత్తయ్య డికెన్స్ మినిస్టర్ ఫారం టూర్ వెళ్ళారంట వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎప్పుడూ రావాలో ఆర్మీ వాళ్ళు చెప్తానన్నారు అంటుంది ముకుంద. ఈసారి పిలుపు వస్తే ఎవరు వద్దు నువ్వు ఒక్కదానివే వెళ్ళు అంటుంది భవాని. మరోవైపు ఇంత రాత్రిపూట మురారి ఎక్కడికి వెళ్ళాడు భార్యకి మల్లెపూలు తీసుకురావడానికి అంటూ ఆలోచనలో పడుతుంది ముకుంద.

అయినా అగ్రిమెంట్ మ్యారేజ్ లో మల్లెపూలు కి చోటు ఎక్కడ ఉంటుంది అంటూ తనకు తానే సమాధానం చెప్పుకుంటుంది. మరోవైపు మురారి రావటంతో అతనికి ఎదురెళ్లి నువ్వు బయటికి వెళ్ళటం చూసి ఎప్పుడు ఎప్పుడు వస్తావు అని ఎదురుచూస్తున్నాను అంటుంది ముకుంద. బయటికి వెళ్లిన వాడిని ఇంటికి రాకుండా పోతాను అంటాడు మురారి. ఇంట్లో అందరి ముందు మాట్లాడుకోవటానికి నేనేమీ అగ్రిమెంట్ భార్యను కాదు అంటుంది ముకుంద. మాటిమాటికీ నువ్వు అగ్రిమెంట్ గురించి గుర్తు చేయొద్దు ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు అంటాడు మురారి.

ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని ముకుంద అంటే తెలియాల్సిన టైం వచ్చినప్పుడు మేమే చెప్తాము మురారి. ఇంట్లో ఎవరికీ కాకుండా నాకు మాత్రమే చెప్పావు అంటే నీ దృష్టిలో నేను స్పెషలే కదా అంటుంది ముకుంద. ఆ క్షణంలో నెత్తి మీద ఏదో కూర్చొని నీకు ఏదైతే చెప్పకూడదు అనుకున్నాను అదే చెప్పాల్సి వచ్చింది అనుకుంటాడు మురారి. చేతిలో ఉన్న ప్యాకెట్ చూసి నాకోసం సారీ తీసుకొచ్చావా అంటుంది ముకుంద.

నాకోసమే యూనిఫామ్ తెచ్చుకున్నాను అంటాడు మురారి. నువ్వు నాకోసం ఏమైనా తెచ్చావేమో అని ఆశ పడ్డాను అయినా నువ్వు నాకు నేను నీకు గిఫ్ట్లు ఇచ్చుకునే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి అంటుంది ముకుంద. నాకు కృష్ణకి జరిగింది అగ్రిమెంట్ పెళ్లి కానీ నీకు ఆదర్శ్ కి నిజమైన పెళ్లి జరిగింది అంటాడు మురారి. ఆదర్శం తిరిగి వస్తాడు అని నీకు అనిపించినా నాకు అనిపించడం లేదు అంటుంది ముకుంద. ఆ మాటకి షాక్ అయిన మురారి ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు.

ఆమె మాటలకు ఇరిటేట్ ఫీలవుతున్న మురారి నేను వెళ్తున్నాను అంటాడు. లేట్ అయితే నీ అగ్రిమెంట్ భార్య ఊరుకోదా అంటుంది ముకుంద. భవాని అత్తయ్య నిన్ను కోప్పడుతుంటే నాకు చాలా బాధనిపించింది నేను చూడలేకపోయాను అందుకే తప్పు నా మీద వేసుకున్నాను, నేను ఏం చేసినా నీ ప్రేమ కోసమే చేస్తాను అంటుంది ముకుంద. ఇక అక్కడ ఉండలేక వచ్చేస్తాడు మురారి. మరోవైపు టాబ్లెట్ వేసుకోమంటూ నందు వెనక పరిగెడతారు ఆమె పిన్ని, బాబాయ్.

నువ్వు ఈ ఒక టాబ్లెట్లు వేసుకుంటే మాకు పరుగు పందెం తప్పుది అంటారు వాళ్ళు. నాకేమీ వద్దు అంటూ కృష్ణ గదిలో దూరుతుంది నందు. ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్తుంది నందు. టాబ్లెట్లు వేసుకోవాలి కదా అని మురారి అంటే నాకొద్దు చేదుగా ఉంటుంది అంటుంది నందు. నువ్వు టాబ్లెట్ వేసుకోకపోతే మరి ఇంజక్షన్ చేయించాల్సి ఉంటుంది అంటూ ఆమెని బుజ్జగించి ఆ మందు వేస్తుంది కృష్ణ. మీరందరూ మంచివాళ్లు కాదు రాక్షసులు అంటూ బలవంతంగా మందు మింగుతుంది నందు.

నాకు నిద్ర వస్తున్నట్లుగా ఉంది అని నందు అనడంతో ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు ఆమె పిన్ని, బాబాయ్. ఇదంతా చూస్తూ బాధపడతాడు మురారి. ఆదర్శ ఎటు వెళ్లిపోయాడు తెలీదు నందిని చూస్తే ఇలా అయిపోయింది మా పెద్దమ్మకి ప్రశాంతతే లేదు అంటాడు. ఈ రోజుల్లో నయం కానీ జబ్బు ఏమీ లేదు తన గురించి నేను కేర్ తీసుకుంటాను తనదే నా ఫస్ట్ అంటుంది కృష్ణ. ఇంత క్రిటికల్ కేసు నువ్వెలాగా సాల్వ్ చేస్తావ్ అంటే మా సీనియర్స్ హెల్ప్ తీసుకుంటాను అంటుంది కృష్ణ.

నీకు హెల్ప్ చేసే ఆ సీనియర్ డాక్టర్ దొరకాలని కోరుకుంటున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి. నిద్రలో ఉన్న కృష్ణకి ఫోన్ చేసి నీ టేబుల్ మీద ఏముందో చూడు అని చెప్తాడు మురారి. చూశాను ఏమి లేదు అని కృష్ణ అంటే నీ పిల్లో పక్కన చూడు అంటాడు మురారి అక్కడ కూడా ఏమీ లేదు అసలు మీరు ఏం వెతకమంటున్నారు అంటుంది కృష్ణ. అయితే డోర్ వైపు చూడు అంటాడు మురారి. అటువైపు చూసేసరికి డాక్టర్ యూనిఫామ్ తీసుకొని మురారి.

నా తరపు నుంచి కాంప్లిమెంట్ గా ఈ డ్రెస్ నీకోసమే అంటూ ఆమెకి ఇస్తాడు. ఆ డ్రెస్ చూసి ఆనంద పడిపోతుంది కృష్ణ. తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. స్టెతస్కోప్ మెడలో వేసుకొని చూసుకుంటుంది. తండ్రి ఫోటో చూస్తూ అతని ఆఖరి మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఏసీపి సార్ నిలబెట్టుకున్నందుకు అతనికి థాంక్యూ చెప్తుంది. ఇవ్వచ్చు కదా అని అంటే నేను నిద్ర లేపితే లేవవు టచ్ చేయబోతే మన అగ్రిమెంట్ మ్యారేజ్ ని గుర్తు చేస్తావ్ ఈ గోలంతా ఎందుకు అందుకే ఇలా చేశాను అంటాడు మురారి.

మా నాన్న ఉంటే కచ్చితంగా ఇవే తెచ్చేవారు అంటుంది కృష్ణ. ఆయన లేకపోయినా ఆయన బాధ్యతలన్నీ నేనే పూర్తి చేస్తాను. నీ బాధ్యతలన్నీ ఆయన నాకే అప్పచెప్పారు అంటాడు మురారి. అవును కదా అంటున్న కృష్ణతో మాటల్లో పడి నీ రెస్పాన్సిబిలిటీని మర్చిపోవద్దు హాస్పిటల్ కి లేట్ అవుతుంది బయలుదేరు అంటాడు మురారి. అమ్మో అక్కడ హిడింబి లాంటి పరిమళ మేడం ఉన్నారు లేట్ అయితే వార్డు చుట్టూ రౌండ్స్ కొట్టిస్తారు అంటూ కంగారుగా స్నానానికి బయలుదేరుతుంది కృష్ణ.

 అంతలోనే అక్కడికి కాపీ తీసుకొని వస్తుంది ముకుంద. నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావు అని అడుగుతాడు మురారి. ఏం నేను తీసుకురాకూడదా అని ముకుందా అంటే గదిలోకి ఎందుకు తీసుకొచ్చావు అంటాడు మురారి. నేను కోరుకున్నది ఇదే కదా ప్రేమించుకునేటప్పుడు నేను కన్నా కలల్ని ఇప్పుడు నిజం చేసుకుంటాను అంటుంది ముకుంద. తరువాయి భాగంలో హాస్పిటల్ కి వెళ్తున్న కృష్ణని ఆపి ఇంటి పని వంట పని అందరి మీద వదిలేసి బయటికి వెళ్లిపోతావా అంటుంది భవాని.

నాకు ఎంతమందికి వండడం రాదు అయినా నాకు అంత టైము లేదు అంటుంది కృష్ణ. హాస్పిటల్లో జాయిన్ అయి ఒక్కరోజైనా కాలేదు అప్పుడే పెద్ద అత్తయ్యకి పెద్ద సమాధానం చెప్తావా అంటుంది ముకుంద. ఈ ఇంటి కోడలికి కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి నెరవేర్చాకే నువ్వు బయటకు వెళ్లాలి అంటుంది భవాని.