ఇండియాలలోనే ఫస్ట్ మడ్ రేస్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది మడ్డి. ప్రయోగాత్మకంగా అత్యంత వ్యయప్రయాసలతో  నిర్మితమవుతున్న మడ్డి మూవీ టీజర్ నేడు విడుదల కావడం జరిగింది. ఒకటిన్నర నిమిషాల నిడివి గల మడ్డి టీజర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ సాగింది. భయంకరమైన అరణ్య దారులలో ప్రత్యర్థుల మధ్య జరిగే డు ఆర్ డై డెత్ రేసులతో పాటు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మడ్డి మూవీ తెరకెక్కుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. 

ఇక మడ్డి మూవీ టీజర్  ప్రముఖ నటులు విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, ఉన్ని ముఖందన్, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిజు విల్సన్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేశారు. మడ్డి మూవీ ఐదు భాషలలో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. మలయాళ, కన్నడ, తెలుగు, తమిళ మరియు హిందీ భాషలో మడ్డి మూవీ విడుదల కానుంది. టీజర్ విడుదల తరువాత మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. 

యువన్, రిద్దాన్ కృష్ణన్, అనూష సూరజ్, అమిత్ శివదాస్ వంటి కొత్త నటులు ఈ మూవీలో నటించడం విశేషం. దర్శకుడు డాక్టర్ ప్రగబల్ ఈ ఆఫ్ రోడ్ రేస్ చిత్రమైన మడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీకే 7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ తెరకెక్కిస్తున్నారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బాసృర్ మడ్డి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా మడ్డి విడుదల కానుంది.